బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న కాంతార.. KGFని వెనక్కి నెట్టిందిగా!

ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే సినిమా గురించి వినబడుతోంది.. అదే కాంతార. అవును కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ వసూళ్ల సునామిని సృష్టించి, ఇపుడు తెలుగులో రిలీజ్ అవడానికి సిద్ధమైంది. దీనిని ప్రముఖ తెలుసు నిర్మాత అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బేనర్ పైన రిలీజ్ చేయనున్నాడు. ఇకపోతే కన్నడలో KGF చిత్రం తరువాత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందినది ఈ సినిమానే. ఇక ఈ సినిమాని కూడా హోంబలే ఫిల్మ్స్ వారు ప్రొడ్యూస్ చెయ్యడం విశేషం.

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇకపోతే తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసిందని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అదేమిటంటే IMDBలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచి, ఆశ్చర్యపరిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక అక్టోబర్ 14న హిందీలో విడుదల కానున్న ఈ మూవీ IMDB రేటింగ్ 9.6 సాధించి రికార్డుకెక్కింది.

ఈ విషయంలో KGF.. RRR చిత్రాలను వెనక్కి నెట్టింది. కేజీఎఫ్ IMDB లో 8.4కాగా.. RRRసినిమాకు (8) రేటింగ్ ఉన్నాయి. ఇక కాంతారా సినిమా కంటెంట్ విషయానికొస్తే, ఇది కర్ణాటకలోని కంబ్లా, బూటా కోలా సంప్రదాయ సంస్కృతిని అన్వేషించే ఓ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. ఇందులో రిషబ్ శెట్టి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించి కనువిందు చేసాడు. కర్ణాటకలో ఈ సినిమా దాదాపు రూ. 58 కోట్లు వసూలు చేసి, ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.