బాలయ్యలో ఇంతటి మార్పు రావడానికి కారణం ఆ సినిమానేనా..?

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వచ్చిన అఖండ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టడం జరిగింది. ఇక ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా క్రేజ్ వల్ల బాలకృష్ణ బుల్లితెరపై ప్రసారమవుతున్న అహ లో అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరించే అవకాశం దక్కింది. దీంతో తాజాగా రెండవ సీజన్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న క్రేజీ ప్రకారం బాలకృష్ణ తన తదుపరి చిత్రాలతో కూడా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు భావిస్తున్నారు.

Akhanda 20 Days Box Office Collection: Here's How Much The Nandamuri  Balakrishna Starrer Has Earned So Far - Filmibeat
ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 107 వ సినిమాకి అఖండ చిత్రం కంటే మరింత ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అఖండ చిత్రం రూ.55 కోట్ల రూపాయలు బిజినెస్ జరగగా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రూ.70 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు అఖండ కంటే ఎక్కువ స్థాయిలో బాలకృష్ణ నటిస్తున్న 107 వ సినిమా బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Akhanda (2021) - IMDb
ఇక కొంతమంది మేకర్స్ వినిపిస్తున్న సమాచారం.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, నటీనటుల కారణంగా ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడిందని తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి మంచి ఆఫర్లు వెలుబడుతూనే ఉన్నాయి కొంతమంది క్రిటిక్స్ చెప్పిన ప్రకారం ఈ చిత్రం నైజాం హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడు పోయే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇక అఖండ సినిమా నైజాంలో రూ.10.5 కోట్లకు అమ్ముడు పోగా కలెక్షన్ పరంగా రూ.19 కోట్లు రాబట్టింది. అయితే ఇదంతా కేవలం బాలకృష్ణ అకాండ సినిమాలో నటించడమే అని చెప్పవచ్చు.