సమంత పాన్ ఇండియా హీరోయిన్గా సక్సెస్ అయ్యేనా..?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది హీరోయిన్ సమంత. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ప్లాన్ వేస్తోంది. సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్-2 అనే వెబ్ సిరిస్తే బాగా పాపులర్ అయింది అలాగే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించి మరింత పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే సమంత హిందీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదని చెప్పవచ్చు. నేరుగా హిందీలో సినిమా చేయకపోయినా ఆమె ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ అని చెప్పవచ్చు. అయితే ఆ పేరు కాపాడుకోవడానికి పలు ప్రయత్నాలు చేయవలసి ఉంది సమంత.

Samantha Prabhu's Upcoming Films: From Her Bollywood Debut With Taapsee Pannu To Kushi and Others

సమంత ప్రస్తుతం తన చేతుల పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పటికే యశోద, శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలలో నటిస్తూ ఉంది ఇవన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోని షూటింగ్ను పూర్తి చేసుకున్నాయి. ఇందులో యశోద చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుందని చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. యశోద చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో సమంత ఒక గర్భిణి మహిళా పాత్రలో నటించబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక యశోద సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ఆకట్టుకుంటుందా లేదా అనే విషయం పై చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ఇక సమంత ఈ సినిమా సక్సెస్ చాలా కీలకమని కూడా చెప్పవచ్చు. ఇక స్టార్ హీరోయిన్ తాప్సీ తో కూడా తన ప్రొడక్షన్ హౌస్ పై సమంత ఒక బాలీవుడ్ మూవీకి కమిట్ అయింది.ఈ క్రమంలోని ఆయుష్మాన్ ఖురాన్, అక్షయ్ కుమార్ తదితర బాలీవుడ్ హీరోలతో తన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.