బాలకృష్ణ భయపడేది కేవలం ఆవిడకు మాత్రమేనా..?

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.ఒకప్పుడు నందమూరి కుటుంబంలో హీరో అంటే ఎన్టీఆర్ బాగా గుర్తుకు వచ్చేవారు. ఇక ఆయన వారసత్వం కింద ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన నట వారసత్వాన్ని పుచ్చుకొని ఆయన కుమారుడైన బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఇప్పటికీ కూడా బాలకృష్ణ పలు సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయం పక్కన పెడితే. కుటుంబ విషయానికి వస్తే ఆయన కూతురు బ్రాహ్మణి కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.

Balakrishna Age Height Son Daughter Family Photos Biography Profile
ఎందుచేత అంటే నారా లోకేష్ ను వివాహం చేసుకొని ఈమె వారి యొక్క పలు బిజినెస్ వ్యవహారాలను చుసుకుంటూ ఉంటోంది. ఇక బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. ఇక ప్రత్యేకంగా చెప్పాలి అంటే బాలకృష్ణ భయపడేది కేవలం ఈమెకు మాత్రమే నట. తన చిన్న కూతురు అంటే ఆయనకు చాలా ప్రేమ అలాగే ఆమె ఏం చెప్పినా సరే ఖచ్చితంగా బాలకృష్ణ వింటారట.ఆమె బాలయ్య సినిమాలకు సంబంధించి వ్యవహారాలను మొత్తం ఆమె చూసుకుంటూ ఉంటుందని సమాచారం.

Balakrishna Wiki, Height, Age, Wife, Family, Children, Caste, Biography &  More. - BigstarBio
ఇక బాలకృష్ణ సినిమా డేట్స్,ఇతర ప్రోగ్రాములు ఏవైనా సరే తన చిన్న కూతురు తేజస్విని చూసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య ప్రతిరోజు ఏ డ్రస్సు వేసుకోవాలి అనే నిర్ణయం కూడా ఆమె తీసుకుంటుందట. ఇదివరకు బాలయ్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవులు అన్ని తన భార్య చూసుకునేది.

Balakrishna Becomes Grandpa Again! కానీ ఇప్పుడు తేజస్విని అలాంటి బాధ్యతలు అన్ని తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇక తేజస్విని గీతం యూనివర్సిటీ మూర్తి మనవడు శ్రీ భరత్ ను ఇమే వివాహం చేసుకున్నది. అలా ఒకవైపు తన కుటుంబాలలో చూసుకుంటూనే తన తండ్రి సినిమాల వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఉన్నది తేజస్విని.