“ఉ అంటావా మావ..ఊ ఊ అంటావ మావ” ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..చెప్పండి . సమంత ఈ పాటలో కనిపించినంత హాట్ గా ఎప్పుడు కనిపించలేదు. అంతలా తన బాడీలోని అందాలను ఎక్స్పోజ్ చేసి సినిమా హిట్ అవ్వడానికి హ్యూజ్ కారణమైంది. ఊ ఒక్క్క్క పాట సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకొని దేశాన్ని షేక్ చేసింది .
ఎక్కడ చూసినా ఈ పాట మారుమ్రోగిపోయేది . అంతలా తన మాటలతో మాయ చేశాడు చంద్రబోస్. ట్యూన్ కట్టి టెంప్ట్ చేశాడు.. దేవి శ్రీ ప్రసాద్. మనకు తెలిసిందే పుష్ప సినిమాలో ఫస్ట్ టైం తన కెరీర్లో ఐటమ్ సాంగ్ చేసింది హీరోయిన్ సమంత . ఆ పాటనే ఈ ఊ అంటావా మావ పాట . ఇప్పటికి ఎక్కడైనా ఫంక్షన్లు జరిగినా ఈవెంట్లు జరిగిన ఈ పాట ఉండాల్సిందే . అంతెందుకు మొన్న ఒకానొక ఫంక్షన్ లో ఏకంగా స్టేజిపై చిరంజీవి ఉ అంటావా అంటూ కైపెక్కించే విధంగా పాడాడు. అంతలా ఈ పాట పాపులర్ అయ్యింది.
అయితే ఈ పాటలో హీరోయిన్గా మొదట సమంతను అనుకోలేదట సుకుమార్ . ఈ పాట కోసం ముందుగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని అని అనుకున్నారట. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ పర్సనల్ సజీషన్ ఇవ్వడంతో మన తెలుగు హీరోయిన్ ని పెట్టుకుందామని చెప్పి ఆలోచనకు వచ్చారట . ఇక తర్వాత మన తెలుగు హీరోయిన్స్ ఎవరు ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరా అని బాగా వెయిట్ చేసి ఆలోచించగా ఫైనల్ గా సమంత పేరు తట్టిందట. అప్పటికి సమంత డివోర్స్ ఇష్యూ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇక సమంత ఈ పాట చేస్తే సినిమాకు పిచ్చ క్రేజ్ వస్తుందని సుకుమార్ బన్నీ ఫిక్స్ అయిపోయారట. ఇక అనుకున్నదే ఆలస్యం సమంతను అడగడం ఆమె ఫస్ట్ నో చెప్పి ఆ తర్వాత బన్నీ చెప్పడంతో ఈ పాట ఒకే చెప్పి కేవలం ఒక్క రోజులో ఈ పాట షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.