పెళ్లి పీటలు ఎక్కబోతున్న… స్టార్ దర్శకుడు కూతురు..!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట్లో పెళ్లి గంట మోగింది. ఆయన పెద్ద కుమార్తె నీలిమా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా నీలిమ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రవి ప్రక్యా అనే అబ్బాయి తో నీలిమ ఏడు అడుగులు నడవబోతుంది. ఈ నిశ్చితార్థ వేడుకల్లో గుణశేఖర్ కుటుంబ సభ్యులు, ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు.

Director Gunasekhar's wedding buzz. – iittm.in

ఈ విషయాన్ని గుణశేఖర్ సోషల్ మీడియా వేదిక తన అభిమానులతో పంచుకున్నారు. గుణశేఖర్ కూతురు నీలిమ కూడా తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ఆమె తన సోషల్ మీడియాలో ‘నా జీవిత ప్రయాణం మొదలైంది’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నేటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమాలపై ఉన్న ఆస్తితో నీలిమ తన నాన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. నీలిమ రుద్రమదేవి సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం సమంతతో తెరకెక్కిన‌ ‘శాకుంతలం’సినిమాకు నిర్మాతగా కొనసాగుతుంది.