లైవ్ లోనే తన స్టామినా చూపించిన బండ్ల గణేష్.. వీడియో వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో నటుడు, నిర్మాతగా ,రాజకీయవేత్తగా ఎంత పేరు సంపాదించారు నటుడు బండ్ల గణేష్. తరచూ నిరంతరం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటాడు బండ్ల గణేష్. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఎవరైనా అన్నారంటే చాలు టక్కున ప్రత్యక్షమవుతూ ఉంటారు బండ్ల గణేష్. ఇక అలాంటి సమయంలోనే బండ్ల గణేష్ చేసే ట్విట్ట్లు పలు వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి వివాదాలను అసలు పట్టించుకోరు బండ్ల గణేష్. తాజాగా బండ్ల గణేష్ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.

Rumour: Bandla Ganesh to become the lead actor?
ఇక ఈ వీడియోలో పూరి జగన్నాథ పై మరొకసారి కామెంట్లు చేసి చాలా వైరల్ గా మారారు. అయితే ఇప్పుడు తాజాగా అదే వీడియోలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి కాల్ చేయడం చర్చనీయాంశముగా మారుతోంది. ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ మీకు వార్నింగ్ ఇచ్చారంట కదా అంటూ ఆ యాంకర్ ప్రశ్న అడగగా.. వెంటనే బండ్ల గణేష్ ఇంటర్వ్యూ మధ్యలోనే అనిల్ కుమార్ యాదవ్ కు ఫోన్ చేసి హాయ్ అనిల్ అన్న మీరు నాకు వార్నింగ్ ఇచ్చారా అని ప్రశ్నించాగా.. అందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా నేనెందుకు వార్నింగ్ ఇస్తాను అంటూ ఆన్సర్ చెప్పారు వెంటనే బండ్ల గణేష్ ఇక్కడ అంటూ కౌంటర్ ఇవ్వడం జరిగింది.

అయితే గతంలో వైఎస్ఆర్సిపి ఎంపీకి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇవ్వడంపై గణేష్ స్పందించడం జరిగింది. తనకు ఆ ఎంపీ తో శత్రుత్వం లేదని కమ్మ సామాజిక వర్గం అంటూంటే అలా ట్వీట్ చేశానని తెలియజేశారు. చంద్రబాబుతో తగాదాలు ఉంటే వాళ్లు వీళ్లు తేల్చుకోవాలని కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడకూడదని వివరించాలని తెలిపారు.