పూరీ జగన్నాథ్ పై మరొక్కసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్..!!

పూరి జగన్నాథ్ బండ్ల గణేష్ కి ఎక్కడ చెడిందో తెలియదు కానీ.. ఎప్పుడూ కూడా బండ్ల గణేష్ ,పూరి జగన్నాథ్ పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఒక వార్ నడుస్తోందని చెప్పవచ్చు. ఆమధ్య చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్ గా వెళ్లిన బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ పైనా సెటైర్లు వేయడం జరిగింది. అయితే ఈవెంట్ కు మాత్రం పూరి జగన్నాథ్ హాజరు కాలేదు. దీంతో బండ్ల గణేష్ తనదైన స్టైల్ లో కాస్త విరుచుకుపడ్డారని చెప్పవచ్చు. ఎంతమందిని స్టార్లను చేసావ్ కానీ కన్న కొడుకుని స్టార్ట్ చేయలేకపోయావు అంటూ బండ్ల గణేష్ మాట్లాడడం జరిగింది.

Puri Jagannadh gives befitting reply to Bandla Ganesh's remarks | Telugu  Movie News - Times of India
ఇక దీంతో పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్స్ లో బండ్ల గణేష్ కి కౌంటర్ ఇచ్చారనే వార్తలు బాగానే వినిపించాయి.. నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా ప్రమాదమని వీలైతే ఎక్కువసేపు వినాలని లేకపోతే అతిగా మాట్లాడడం మంచిది కాదని విషయాన్ని తెలియజేశారు పూరి జగన్నాథ్. అయితే ఈ మాటలు బండ్ల గణేష్ ని ఉద్దేశించి మాట్లాడాలని మీడియాలో చాలా వార్తలు వైరల్ గా మారాయి. ఇక్కడితో ఈ కథ ముగిసింది అనుకుంటే తాజాగా మరొకసారి పూరి పై సెటైర్లు వేయడం జరిగింది.

Bandla Ganesh: Bandla Ganesh made interesting comments on Puri Jagannath.  Actor cum producer bandla ganesh shocking comments on director puri  jagannadh in chor bazaar pre release event - filmyzoo - Hindisip
ఈసారి డైరెక్ట్ గానే ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. రాజకీయాలను ఎందుకు గెలుకుతున్నారని యాంకర్ అడగగా.. నేను ఎక్కడ గెలీకాహానని బండ్ల గణేష్ దాటు వేశారు. పోసాని కృష్ణ మురళికి మామూలుగా చావు రాదని గతంలో బండ్ల గణేష్ అన్న మాటలను కూడా గుర్తు చేశారు.. అయితే ఏదోలా చెప్పి ఈ విషయాన్ని దాటేశాడు కానీ.. పూరి జగన్నాథ్ పైన ఎందుకు స్పందించారు అని అడగగా.. భార్య బిడ్డని ప్రేమించినోడు మనిషేనా అంటూ బండ్ల గణేష్ మరొకసారి ఫైర్ అయ్యారు. దీంతో యాంకర్ ప్రేమించడం ప్రేమించకపోవడం అతని ఇష్టం అంటూ తెలిపారు. పూరి అనే వాడికి మంచి చెడు చెప్పే రైట్స్ తనకు ఉందని తను నా ఫ్రెండ్ అని బండ్ల గణేష్ తెలిపారు. దీంతో ఈ విషయం మరొకసారి వైరల్ గా మారుతోంది.