బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నా బాలయ్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో బాలకృష్ణ ఇప్పటికి తన హవా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో హోస్టుగా కూడా బాగానే అదరగొడుతున్నారు. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు చూసిన బాలకృష్ణ అఖండ సినిమా నుంచి తన కెరియర్ ఒక్కసారిగా మలుపు తిప్పుతున్నారు ఉత్సాహంతో పలు క్రేజీ ప్రాజెక్టుల ను లైన్ లో పెట్టారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక మాస్ సినిమాని చేయబోతున్నారు.

NBK 108: All you need to know about Nandamuri Balakrishna and Anil  Ravipudi's film | The Times of India
ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ,అనిల్ దర్శకత్వంలో తన 108 చిత్రం పైన ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది. ఇక ఇందులో బాలకృష్ణ ఇంతకుముందు ఎన్నడు చూడని విధంగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారని మేకర్స్ తెలియజేశారు. తాజాగా ఒక అనౌన్స్మెంట్ వీడియో అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అనిల్ ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసేస్ కోసం వెభిన్నమైన మాస్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని సమాచారం.

కామెడీ ట్రాక్ ను తగ్గించి ఒక పవర్ఫుల్ సబ్జెక్టుతో సినిమా కథ ని పెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఎవరు చూడని కొత్త కోణంలో బాలకృష్ణని చూడబోతున్నట్లుగా అనిల్ రావుపూడి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు వల సన్నహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటులను సైతం భాగస్వామ్యం చేయాలని చిత్ర బృందం పలు సమ్మహాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీలిల ఒక కీలకమైన పాత్రలో నటించబోతోంది. అలాగే హీరోయిన్ అంజలి, ప్రియమణి లను కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం.