అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న స్టార్ హీరోయిన్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్ల మధ్య గట్టి పోటీ తత్వం ఉంటుందని చెప్పవచ్చు. ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారినా అది హీరోయిన్ల తలరాతలు బట్టి కూడా అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి. కొంతమందిని ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉండాలని చెప్పవచ్చు. ఇక హీరోయిన్గా రాణించాలి అంటే కచ్చితంగా టెక్నికల్ బాగా తెలిసి ఉండాలి. ఇక బాలీవుడ్ పరిశ్రమలో గత రెండేళ్లుగా సక్సెస్ రేటు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. దీంతో సినీ నిర్మాణం కూడా భారీగానే తగ్గిపోతుంది.

ముఖ్యంగా మీడియం బడ్జెట్ సినిమాలు కూడా భారీగా తగ్గిపోయాయి. స్టార్ హీరోలు మూడు నాలుగు ఏళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. ఇక వాళ్ల సరసన టాప్ మోస్ట్ హీరోయిన్లు మాత్రమే నటిస్తూ ఉన్నారు. అంతకుమించి కింద స్థాయి హీరోయిన్స్ తీసుకోవడం చాలా కష్టతరంగా మారిపోయిందని చెప్పవచ్చు . దీంతో కొంతమంది హీరోయిన్లు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారిలో హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మకి కొంతకాలంగా సరైన విజయాలు లేక హీరోయిన్ రేసులో వెనుకబడిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కేవలం డబుల్ ఎక్స్ ఎల్, కాకుడా చిత్రాలు మాత్రమే ఉన్నాయి. కొత్త సినిమాలను పెద్దగా ఒప్పుకోలేదు. అందుకేనేమో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాల వైపు తన దృష్టిని మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హ్యుమా ఖురేషితో కలిసి డబుల్ ఎక్స్ ఎల్ లో నటిస్తోంది . ఇందులో ఇద్దరు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ఆ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. తాజాగా సోనాక్షి అప్కమింగ్ ప్రాజెక్టు కూడా ఇలాగే ప్లాన్ చేసిందని సమాచారం. ఇక ఆమెకు తోడుగా వాణీ కపూర్ ను తెచ్చుకొని ఏ గర్ల్ ఇన్ ద ఎల్లో సూట్ కేస్ అని చిత్రాన్ని కూడా పట్టా లెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో సోనాక్షి తో పాటు వాణి కపూర్ కూడా నటించనున్నారు ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ జానర్ మీద తెరకేక్కుతున్నట్లు.. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ దర్శకుడు ఆషీమీ అహ్లువాలియా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది..