ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు, సెలబ్రిటీ భామలు మాత్రమే కాదు హీరోల భార్యలు కూడా తమ అందచందాలతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకునే పనిలో ఉన్నారని చెప్పాలి. ఈ క్రమంలోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మంట రాజేస్తోంది. తాజాగా సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ ఇప్పుడు అల్లు స్నేహారెడ్డికి స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే రకరకాల ఫ్యాషన్ డిజైనర్ దుస్తులతో ఆమెను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.
ఈ క్రమంలోనే స్లీవ్ లెస్ బ్లౌజ్ .. చెంకీ స్కర్ట్ అందాలతో నడుము అందాలు చూపించే విధంగా అల్లు స్నేహారెడ్డి ఇచ్చిన ఎక్స్పోజింగ్ కి కుర్రకారు సైతం ఫిదా అవుతున్నారు. ఫ్యాషన్ ట్రెండుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన స్నేహ రెడ్డి తన లుక్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు చాలామంది యువత ఫ్యాషన్ ఐకాన్ గా ఈమెను ముద్దుగా పిలుచుకుంటున్నారు. అంతలా తన డ్రెస్సింగ్ స్టైల్ తో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకునే పనిలో ఉంది స్నేహారెడ్డి. ఇక ఈమె ధరించే డిజైనర్ దుస్తుల ధరలు కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్నేహారెడ్డి తన స్టైలిష్ లుక్కుతో అందర్నీ అలరించడమే కాకుండా తాను ధరించే దుస్తులు, జువెలరీలను కూడా ప్రమోట్ చేస్తూ ఒకరకంగా లాభార్జన కూడా పొందుతోందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు స్నేహారెడ్డి తన గ్లామర్ తో వరుస ఫోటో షూట్లతో హీరోయిన్లతో పోటీపడే విధంగా సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకుంటుంది. అంతేకాదు ఈమె అందం చూసి , ఫిజిక్ చూసి అభిమానులు సైతం అల్లు స్నేహారెడ్డి హీరోయిన్గా నటించాలని కోరుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అల్లు స్నేహ ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అల్లూ స్నేహ రెడ్డి తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు అభిమానుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.
View this post on Instagram