ఏపీ అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్కరు రెబల్ ఎంపీ అయ్యారు. ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. మిగిలిన వారంతా కూడా.. ఏపీకి వస్తూ పోతూ ఉన్నారు. అభివృద్ధి అనేది పక్కన పెడితే.. ఎంపీలు మాత్రం పార్టీ విషయంలోనూ.. అధినేత విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఇక, ఇటు సీఎం జగన్‌తోనూ, అటు నియోజకవర్గం ప్రజలతోనూ టచ్‌లో ఉంటున్న ఎంపీల్లో ఉత్తమ ఎంపీలు ఎవరు? అనేవిషయానికి వస్తే ఫస్ట్ పేరు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి. ఔను, నిజం. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు రారు. అలాగని చేయాలని అనుకున్న చేయకుండా ఆగడం లేదు.
ఇక,మరికొందరు ఎంపీల మాదిరిగా ఆయన ప్రచారాన్ని కూడా కోరుకోవడం లేదు. పార్టీ తరఫున ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా.. ఆయన ముందుం టున్నారు. వాస్తవానికి ఆయన తిరుపతి ఎంపీగా ఉన్నా తనకు ఉన్న అవకాశంతో తిరుమలలో హల్చల్ చేయొచ్చు. గతంలో చేసిన కొందరు ఎంపీలు ఇలానే వ్యవహరించారు. కానీ, గురుమూర్తి ఎప్పుడూ ఎవరికీ సిఫారసు లెటర్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా నియోజకవర్గంలో ఆయన సైలెంట్‌గా పని చేసుకుని పోతున్నారట. సీఎం జగన్ ఏ పనిచేయమంటే అది చేయడమే తన విధి! అని గట్టిగా చెబుతున్న ఆయన బెస్ట్ ఎంపీల జాబితాలో ముందున్నారట.
ఇక ఈ జాబితాలో రెండస్థానంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్ కనుసన్నల్లో ఏపీకి ముఖ్యంగా తన నియోజకవర్గానికి పెట్టుబడులు తీసుకురావడంలో ముందున్నారట. ఇక కఏపీకి సంబంధించిన విషయాలను పార్లమెంటులో ప్రస్తావించడం.. వాటికి పరిష్కారం చూపేలా చేయడంలోనూ ఆయన ముందున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆయనకు రెండో ప్లేస్ దక్కుతోందని చెబుతున్నారు. మూడో ప్లేస్‌లో కాకినాడ ఎంపీ సత్యవతి ఉన్నారట. ఈమె కూడా సైలెంటే. అయితే.. ఢిల్లీలో పార్టీకి, రాష్ట్రానికి అవసరమైన వాటిని సాధించడంలో మాత్రం ఆమె ముందున్నారని చెబుతున్నారు.
నాలుగో ప్లేస్‌లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి ఈయన లోక్‌సభలో వైసీపీ పక్ష నాయకుడిగా ఉన్నారు. దీంతో ఆయనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారని అంటరూ అనుకుంటారు. కానీ, ఆయన పార్టీ నేత కార్యక్రమాలకు పరిమితం కావడంతో.. ఆయన నాలుగులో ఉన్నారని చెబుతున్నారు. అలాగని ఈయనపై వ్యతిరేకత లేదని చెబుతున్నారు. వివాదాలకు దూరంగా ఉన్న నాయకులుగా కూడా మిథున్ రెడ్డి నెంబర్ 4లో ఉన్నారని చెబుతున్నారు. ఇలా తొలి నాలుగు బెస్ట్ ఎంపీ సీట్ల గురించి వైసీపీలలో చర్చ సాగుతుండడం గమనార్హం.