కాజల్ అగర్వాల్‌ను ఆ దర్శకుడు అంతలా అవమానించాడా? ఏది నిజం?

కాజల్ అగర్వాల్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. ఆమెపేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చందమామ. అవును, మొదటి సినిమా ఆమెకి అది కాకపోయినా, చందమామ అనే సినిమాతోనే ఆమె తెలుగు చిత్ర సీమలో పేరు తెచ్చుకుంది. అందుకే ఆమెని ముద్దుగా చందమామ అని పిలుస్తారు. ఇక ఆమె ముఖారవిందం కూడా అచ్చం చందమామ లాగే ఉంటుంది మరి. ఇకపోతే ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. కాజల్ అగర్వాల్ దాదాపు రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంది. కెరీర్‌లో అవకాశాలు తగ్గుతున్నాయని భావించిన టైంలోనే బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లాడింది ఈ చందమామ.

దాంతో ఇటీవల పండంటి బాబుకు కూడా ఈమె జన్మనిచ్చింది. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. ఈనేపథ్యంలోనే కాజల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాజల్ తన కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది. అందులో చందమామ, మగధీర, డార్లింగ్, బృందావనం, నేనే రాజునేనే మంత్రి వంటి చాలా సినిమాల్లో చేసింది. స్టార్ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలోనూ పలు సినిమాలు చేసిన కాజల్. ఎంతో మంది అభిమానులన సంపాదించుకుంది.

తాజాగా కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి చూస్తోందని టాక్ వినబడుతోంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న భారతీయుడు -2 సినిమాలో కాజల్ అవకాశం కొట్టేసిందని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ డైరెక్టర్ కాజల్‌కు సినిమా చాన్స్ ఇస్తానని చెప్పాడట.. కానీ ఒక కండిషన్ పెట్టాడట! ముందుగా తన బుగ్గలు తగ్గించుకోవాలని, బాడీలో ఫ్యాట్ నెస్ తగ్గించాలని పేర్కొన్నాడట. లేనియెడల చాన్స్ కష్టం అని చెప్పడంతో…కాజల్‌ను ఇలా అవమానిస్తారా అంటూ డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మన చందమామ ఫాన్స్.