మళ్లీ పెళ్లికి సిద్ధమైన సురేఖ వాణి.. అతడే కావాలంటూ..?

ప్రముఖ నటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అభిమానులను సొంతం చేసుకున్న సురేఖ వాణి సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. సినిమాలలో అవకాశాలు లేకపోయినా సరే సోషల్ మీడియా ద్వారా వరుస ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఈమె చేసే రచ్చ అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ముఖ్యంగా తన కూతురితో కలిసి ఈమె ఏకంగా పబ్బులు ,పార్టీలు, థాయ్ మసాజ్ అంటూ రకరకాల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ విపరీతంగా ట్రోలర్స్ చేతిలో ట్రోల్ అవుతూ ఉంటుంది. ఇక మొన్నటికి మొన్న కూతురు బర్తడే పార్టీలో దగ్గరుండి మరి కూతురికి మందు తాగించి పూర్తిస్థాయిలో ట్రోల్ అయిన ఈమె ఇప్పుడు మరొకసారి పెళ్లి కావాలంటూ సరికొత్త సంచలనానికి తెరలేపింది.Surekha Vani reacts on her daughter Supritha Cine Entry

ఇక గత కొన్ని రోజుల క్రితం కూతురితో కలిసి ఒక ఇంటర్వ్యూకి హాజరైన సురేఖవాణి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ పాట పాడి నిజంగానే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని కూతురు ద్వారా చెప్పకనే చెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ తెలియజేసింది. సురేఖ వాణి మాట్లాడుతూ నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు కానీ నా కూతురు సుప్రీతా మాత్రం నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని సూచిస్తుంది.అంతేకాదు ఇప్పుడైతే రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి అంటూ సురేఖవాణి చెప్పుకొచ్చారు.Telugu Actress Surekha Vani's Daughter Supritha Reveals About Her Fiance

ఇక మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైనా దొరికాడా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పటికైతే ఎవరూ దొరకలేదు అని కూడా ఆమె సమాధానం ఇచ్చింది. అంతేకాదు నాకు కూడా బాయ్ ఫ్రెండ్ కావాలని అనిపిస్తుంది. నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలి.. బాగా డబ్బున్న వాడై ఉండాలి.. హైట్, పర్సనాలిటీ ఉన్న వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గా వస్తే భవిష్యత్తులో నన్ను బాగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ రెండవ పెళ్లి పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.