ఆ విషయంలో సమంతను బీట్ చేసిన రష్మిక.. అందుకే మౌనమా..?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సమంత మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమె సినీ కెరియర్ వివాహానికి ముందు.. వివాహానికి తర్వాత అన్నట్లుగా మారిపోయింది అని చెప్పవచ్చు. వివాహం తర్వాత అన్నీ కూడా బోల్డ్ పాత్రలు చేస్తూ బాలీవుడ్ లో సైతం వరుస ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక మరొక హీరోయిన్ రష్మిక గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన పాగా వేసే ప్రయత్నం చేస్తూ జోరుగా దూసుకు వెళ్తోంది. ప్రస్తుతం ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని అక్కడ కూడా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక.Rashmika Mandanna Reacts to Samantha Ruth Prabhu's Cryptic Tweet on  'Kindness and Expiry Date'ఇకపోతే టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే సత్తా చాటి బాలీవుడ్ లో నటించడానికి అవకాశాలను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువగా బిజీ అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోల కంటే హీరోయిన్లకే ఎక్కువ పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ బ్యూటీ రష్మిక కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ విషయంలో సమంతను సైతం రష్మిక బీట్ చేసి పడేసిందని చెప్పవచ్చు.Samantha refuses to work with Rashmika Mandanna, know why

మొన్నటి వరకూ సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న నెంబర్ వన్ హీరోగా సమంత గుర్తింపు తెచ్చుకోగా .. ప్రస్తుతం ఆ స్థానంలోకి రష్మిక వచ్చి చేరింది. 32 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని టాప్ ప్లేస్ లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక సమంతకు సోషల్ మీడియా ద్వారా కేవలం 24.3 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఇకపోతే సమంతకు నాగచైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా ఇమేజ్ తగ్గినట్లు తెలుస్తోంది. ఒకవైపు బాలీవుడ్ లో కూడా ఈమె వరస సినిమాలు చేస్తున్నా రష్మిక లెవెల్లో అవకాశాలను అందుకోలేకపోతోంది అంటూ భోగట్టా.