వారు మోసం చేయడం వల్లే లక్షల్లో నష్టపోయిన శ్రీకాంత్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు మీడియంలో శ్రీకాంత్ కూడా ఒకరు. గతంలో తాను సైడ్ క్యారెక్టర్ గా నటించి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. దీంతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా పలు పాత్రలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే శ్రీకాంత్ తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తు తన జీవితంలోని జరిగిన కొన్ని విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.B'day Special: From Admiring Chiranjeevi to Working with Him, The Story of  Meka Srikanth

శ్రీకాంత్ తన కెరీర్ లో ఎన్నో సంతోషాలు ఉండడంతో పాటు బాధలు కూడా ఉన్నాయని తెలియజేశారు. కొన్ని సందర్భాలలో కొంతమందిని విమర్శలు చేయవలసి కూడా వస్తుంది.. అంతేకానీ టార్గెట్ చేసి విమర్శలు చేయడం అయితే ఉండదని శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తమ పైన బురద చల్లడం చాలా బాధనిపించింది అని శ్రీకాంత్ తెలియజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కష్టం తప్ప ఎవరికీ ఏమీ ఉండదని శ్రీకాంత్ తెలియజేయడం గమనార్హం. శ్రీకాంత్ కు రాజకీయాలు అంటే నచ్చవని.. తన షూటింగ్ చేస్తున్న సమయాలలో ఎప్పుడూ కూడా ప్రమాదాలు జరగలేదని శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది.Srikanth becomes hoax victim

కానీ తన కెరియర్ లో ఒక గాయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ సమస్య తీవ్రమైందని శ్రీకాంత్ తెలియజేశారు. ఫెయిల్యూర్ వస్తే మొదటి చాలా బాధపడేది తనే అని తెలియజేశారు. చిరంజీవి అభిమాని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ ఉంటానని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో కృష్ణ గారు అంటే చాలా ఇష్టం ఆయన అందరితో కలుపుకొని మాట్లాడుతూ ఉంటారని తెలిపారు.సినిమాలు నటిస్తున్నప్పుడు రెమ్యూనిరేషన్ తీసుకోకుండా ఎదురుగా డబ్బులు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయని తెలియజేయడం జరిగింది.. ఈ విషయం తెలిసినా శ్రీకాంత్ అభిమానులు ఒకసారి గురయ్యారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కొంతమంది నిర్మాతలు వారి దగ్గర డబ్బులు ఉన్నా సరే తనని మోసం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి తెలిపారు. ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.