#NBK 107 నుంచి మరో లీక్..ఫొటోస్ వైరల్..!!

హీరో బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా స్పీడ్ గా ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ డైరెక్షన్లో NBK-107 అనే సినిమా తెరకెక్కిస్తున్న నేపథ్యం లో షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇది రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాలలో ఓపెన్ ప్లేసులో షూటింగ్ జరుగుతున్నది. అయితే చిత్తూరు బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. మొబైల్ నుంచి ఫోటోషూట్ చేసేవాళ్లను కంట్రోల్ చేయలేకపోవడంతో ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉన్నాయి. ఇక జై బాలయ్య జై జై బాలయ్య అనే పాటకు సంబంధించి ఒక క్లిప్ ఇప్పటికీ నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నది.Balakrishna: ఫ్యాక్షన్ అడ్డాలో బాలయ్య సందడి.. శరవేగంగా NBK107 షూటింగ్..  ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్– News18 Telugu

తాజాగా లీకైన సన్నివేశంలో బాలకృష్ణ ఒక పేద రైతు కుటుంబానికి తన వంతు సహాయంగా ఒక కొత్త ట్రాక్టర్లను బహుమతిగా ఇవ్వగా ఆ పేదరైతు అతని భార్య బాలయ్య ఆశీర్వాదం తీసుకోబోతున్నట్లుగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా విడుదల సమయం చాలా ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి ఇలాంటి క్లిప్ లీక్ అవుతూ ఉండడంతో బాలయ్య అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఇక చిత్ర బృందం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి జరగవు అని అభిమానుల సైతం కామెంట్ చేస్తున్నారు.Telugu Balakrishna, Balayya, Shruthi Hasan, Jai Balayya, Kurnool, Scene Leaked-Movie

ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. తాజాగా ఈ సినిమా కర్నూల్ లో షూటింగ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ నటించబోతున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానుల సైతం భావిస్తున్నారు. ఇక అంతే కాకుండా బాలకృష్ణ ఈ సినిమా కోసం 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.