సోషల్ మీడియా సాక్షిగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వరకు కేవలం ఇండియన్ ఆడియెన్స్‌‌కే ఈ పేరు పరిమితం. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ పేరు గ్లోబల్ ఆడియెన్స్ నోట మార్మోగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం ఒక ఎత్తైతే, ఈ సినిమాలో ఇద్దరు మేటి యాక్టర్స్ నటించడం మరో ఎత్తు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు వారి కాంబినేషన్‌కు పర్ఫెక్ట్ కథ పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రూవ్ చేసింది.

ఇక ఈ సినిమాలో చరణ్ పాత్రను హైలైట్ చేశారంటూ పలువురు కామెంట్ చేసినా.. తారక్ పాత్రను తక్కువ చేశారనే విమర్శలు వినిపించినా.. ఆర్ఆర్ఆర్ మాత్రం తన సత్తా ఏమిటో ఈ ప్రపంచానికి చూపించింది. ఇక ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్, భీమ్ పాత్రలో తారక్ పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకుల నుండి ఇంకా ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో భీమ్ పాత్రలో తారక్ పర్ఫార్మెన్స్‌కు కాస్త ఆలస్యంగా ఎక్కువ ప్రశంసలు అందుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలకమైన సీన్స్‌లో తారక్ ఓ వ్యాన్‌లో అడవి జంతువులతో ఇచ్చే ఎంట్రీ ఈ సినిమా చూసిన ఆడియెన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే ఈ క్లిప్ ఆర్ఆర్ఆర్ సినిమాకే హైలైట్ అంటూ సోషల్ మీడియాలో గతకొద్ది రోజులుగా తెగ హల్ చల్ చేస్తోంది. ఇండియన్ ఆడియెన్స్ మాత్రమే కాదు, హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్స్ సైతం ఇలాంటి సీన్ తమ జీవితంలో చూడలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తారక్ లాంటి స్టార్‌కు ఇలాంటి హైలైట్ సీన్ పడటం నిజంగా గ్రేట్ అంటూ తారక్ మేనియాతో సోషల్ మీడియాలో టాక్ నడుస్తుండటం, ఆయన రేంజ్ గ్లోబల్‌గా ఏ విధంగా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా తారక్ మేనియా ఇప్పట్లో తగ్గేలా మాత్రం కనిపించడం లేదు.