తాజా అప్డేట్: #NBK 107 షూటింగ్ జరిగే ప్రదేశాలు ఇవే..!!

నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరుపదుల వయసులో కూడా అంతే ఎనర్జీతో దూసుకుపోతూ.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ లతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న బాలయ్య ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి విదేశాలలో కూడా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ అందించింది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా తర్వాత మరి రెండు మూడు ప్రాజెక్టులను తన చేతిలో పెట్టుకున్న బాలయ్య త్వరగా షూటింగ్ లు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు.Nandamuri Balakrishna's First Look From NBK 107 is His 'Massiest Avatar  Ever'

కారణం ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు తాను కమిట్ అయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బాలయ్య. ఎందుకంటే 2024 లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి రాజకీయ రంగం వైపు దృష్టి పెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలలో జరగబోతోంది అని.. అందుకు సంబంధించిన తాజా అప్డేట్ కూడా బయట వెలువడడం గమనార్హం. మరి బాలయ్య బాబు తన 107వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ను ఏఏ ప్రాంతాలలో ఏ ఏ రోజు జరుపుకోబోతున్నారో మనం ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.2022 జూలై 20వ తేదీన #NBK 107 వ సినిమా షూటింగు ఆలంపూర్ లో ప్రారంభం కానుంది. ఇక ఆ మరుసటి రోజు 21వ తేదీన యాగంటి, 22వ తేదీన గ్రీన్ కో – కొమ్మే చెరువు పరిసర ప్రాంతాలలో జరగబోతోంది. ఇక జూలై 23వ తేదీన పూడిచెర్ల – ఓర్వకల్లు ప్రాంతాల మధ్యలో జరగబోతుండగా, 24వ తేదీన కర్నూల్ ఎయిర్పోర్టులో షూటింగ్ నిర్వహించనున్నారు. 25వ తేదీ కర్నూల్ కోట దగ్గర షూటింగ్ జరగనుండగా.. 26వ తేదీ పంచలింగాల సమీపంలో షూటింగ్ నిర్వహించనున్నట్లు తాజా సమాచారం అందుతోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి బాలయ్య బర్తడే కానుకగా బాలయ్య లుక్ కి సంబంధించిన టీజర్ విడుదల చేయగా విశేష స్పందన లభించింది.