తండ్రి మీద ప్రేమ తో బాలయ్య రోజూ చేసే ఆ పని తెలిస్తే షాక్..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన తండ్రి దర్శకత్వంలో ఎన్నో సినిమాలలో సహాయక పాత్రలో నటించారు. ఇక ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వంలోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య ఆ తర్వాత ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం.. ప్రస్తుతం ఆరుపదుల వయసులో కూడా యువతకు కూడా గట్టి పోటీ ఇస్తూ ఓకే స్పీడులో దూసుకుపోతూ ఉండడం కేవలం బాలయ్య బాబుకు మాత్రమే చెల్లింది. ఆయనకు వయసు పెరిగినా కూడా ఆయన సినిమాలలో బజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడంలో.. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సాధించే కలెక్షన్ లే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.Sr NTR @ 100: Balakrishna To Kickstart Celebrations!

ఇకపోతే ఎంతోమంది అభిమానుల ఆధారాభిమానాలు పొందిన బాలకృష్ణకు తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఎంత ప్రేమో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తాను తన తండ్రి నటించిన సినిమాలను ఎక్కువగా చూస్తానని పలు సందర్భాలలో వెల్లడించారు. అంతేకాదు తండ్రి నుంచి వారసత్వంగా పలు సేవా కార్యక్రమాలను చేస్తూ ఆ కార్యక్రమాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. పెద్దలను గౌరవించే విషయంలో మాత్రం బాలయ్యకు మించి మరెవరు లేరు అనవచ్చు. ఇక మహిళలకు చాలా ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటారు బాలయ్య.Balakrishna - NTR : టాలీవుడ్ హీరోల్లో బాలకృష్ణ మరో రికార్డు.. నట వారసుల్లో ఆ రికార్డు ఎన్టీఆర్ తనయుడైన బాలయ్యకే సొంతం.. | Balakrishna Nandamuri Rare Record He Was The ...

ఇకపోతే ఇటీవల ప్రముఖ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య తమతో ఎప్పుడు మాట్లాడినా కూడా తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గురించి ఖచ్చితంగా బాలకృష్ణ ప్రస్తావిస్తారు అని తెలిపారు. ఇక తన తండ్రిని ప్రతిరోజు వందసార్లు అయినా ఆయన గుర్తు చేసుకుంటారని మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ప్రతిరోజు సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను, పాటలను కచ్చితంగా బాలయ్య చూస్తాడని మురళీమోహన్ వెల్లడించారు ఇకపోతే తన తండ్రిని అమితంగా ప్రేమించే బాలకృష్ణ తన తండ్రి పై ప్రేమను చాటుకునే ఒక్క సందర్భాన్ని కూడా వదులుకోరు అని వెల్లడించారు మురళి మోహన్.