అనుష్క ఆ హీరోకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదట సూపర్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించింది. ఇక అంతే కాకుండా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి మంచి విజయాలను కూడా అందుకుంది. అయితే అనుష్క కెరియర్ ఒక్కసారిగా మలుపు తిప్పిన చిత్రం మాత్రం సైజ్ జీరో అని చెప్పవచ్చు. ఈ సినిమా చేసినప్పటి నుంచి ఈమెకు అవకాశాలు అసలు రావడం లేదు. అందుకు కారణం ఈమె బొద్దుగా మారడమే.Prabhas and Anushka Shetty take their romance to Los Angeles; here's how

అయితే ఇప్పుడు తాజాగా ఒక యువ హీరోతో నటించబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించినప్పటికీ ప్రభాస్ ,అనుష్క జోడి మాత్రం అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య పలు రూమర్లు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రభాస్ – అనుష్క వివాహం చేసుకుంటే చూడాలని ఎంతో మంది అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా వాల్యూ ఇస్తుంది అనుష్క. అందుకు సంబంధించిన వార్త ఇప్పుడు ఒకటి వైరల్ గా మారుతుంది వాటి గురించి చూద్దాం.Billa Telugu Movie Review Prabhas Anushka Hansika Motwani Meherఅనుష్క – ప్రభాస్ సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ అనుష్కకు ఇష్టం లేకుండా నటించిన సినిమా మాత్రం బిల్లా.. ఈ సినిమా కథ మొదట అనుష్కకి చెప్పగా తనకి నచ్చలేదట.. కానీ ప్రభాస్ తనని రిక్వెస్ట్ చేయడంతో ఈ సినిమాకి ఒప్పుకోవాల్సి వచ్చిందట. దీంతో ప్రభాస్ కోసమే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ అనుష్క జోడి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.