యాంకర్-విశ్వక్ సేన్‌ గొడవ: మధ్యలో అనసూయ F*** (వీడియో) వైరల్..!!

మన పెద్ద వాళ్ళకు ఊరికే అంటారా..”తన కోపమే తన శత్రువు” అని.. ఇప్పుడు చూడండి..దేవి నాగవల్లి కోపంలో విశ్వక్ సేన్ ని గెట్ అవుట్ అనడం..ఆయన అదే కోఫంలో F** అంటూ బూతు పదం వాడటం..అంత క్షణాల్లో జరిగిపోయింది. కానీ, దాని ఎఫెక్ట్..పాత వీడియోలను కూడా బయటకు తవ్వుతూ.. రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పుడు అంతా F** ఆ పదమే హైలెట్ గా మారింది. ఆ పదం బూతే కానీ నేటి కాలంలో యువత దానిని చాలా లైట్ గా తీసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఊత పదం లా..కోపం వస్తే చాలు ఆ పదానే వాడుతున్నారు.

గత రెండు రోజులుగా ఆ పదం సృష్టిస్తున్న రచ్చ మనకి తెలియంది కాదు. యాంకర్-హీరో గొడవలో చాలా మంది హీరో కే సపోర్ట్ చేస్తున్నారు. కొందరు ఆడవాళ్లు యాంకర్ కి మద్దతిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సినీ నటీ కరాటే కళ్యాణి ఈ ఇష్యూ పై స్పందించారు. సోషల్ మీడియా వేదిక గా ఆమె అభిప్రాయం తెలియజేస్తూ..హీరో విశ్వక్ సేన్ కే సపోర్ట్ చేసింది. విశ్వక్ సేన్‌కి మద్దతు ప్రకటిస్తూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది . అంత వరకు బాగానే ఉన్నా ఈ ఇష్యూలోకి యాంకర్ అనసూయని లాగేసింది..దీంతో వ్యవహారం మరింత ముదిరిపోయింది.

ఆమె పోస్ట్ లో.. “3*3 టీవీ వర్సెస్ సేన్‌లో పూర్తిగా టీవీ వాళ్లదే తప్పు. నేను ఆ హీరోకే సపోర్ట్ చేస్తా. అనసూయ ఎన్నిసార్లు F** పదం వాడినప్పుడు నువ్వు రోడ్డు మీద డాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మ?’’ అంటూ మండిపడింది. అంతేకాదు కొందరు అయితే..గతంలో అనసూయ..ఆ యాంకర్ ముందే ఆ పదాని వాడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..సూటిగా వాళ్లు అడగాలి అనుకున్నవి అడిగి కడిగి పారేశారు. గతం లో అర్జున్ రెడ్డి సినిమా టైంలో అనసూయ టీవీ 9 ఛానల్‌‌లోనే.. అది కూడా యాంకర్ దేవి ఉండగానే ఆ పదాన్ని వాడుతూ..గట్టి సమాధానమిచ్చింది. ఇప్పుడు ఆ వీడియోనే బయట పెడుతూ..కొందరు నెటిజన్స్ ఆ యాంకర్ పై మండిపడుతున్నారు. పేరు ఉన్నా వాళ్ళు ఆ పదం వాడితే తప్పు లేదు.. చిన్న హీరో అలా అనేసరికి ఇంత హంగామా చేస్తున్నారు సదరు ఛానెల్ అంటూ తిట్టిపోస్తున్నారు. దీని పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి..?