వామ్మో..మీనా ప్రెగ్నెంటా..ఈ వయసుల్లోనా..?

మీనా.. పేరుకి పరిచయమే అక్కర్లేదు. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రాకారు మతులు పొగొట్టిన బ్యూటి. అబ్బో అప్పట్లో అమ్మడు హవా బాగా నదిచిందిలేండి. మీనా సినిమాలో ఉంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనేవాళ్లు. దాదాపు అందరు స్టార్ హీరోలతో రెండు మూడేసి సినిమాలల్లో నటించింది. ఒకానోక టైంలో మీనా చేతిలో పది సినిమాలు పైనే ఉన్నాయి. డైరెక్టర్స్ ఆమె ఇంటికి క్యూ కట్టే వారు. కాల్ షీట్ల కోసం ఎగబడేవారు. స్టార్ హీరోలతో సమానంగా మీనా రెమ్యూనరేషన్ తీసుకుంది అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనా..ఆ సినిమా ఆమె నటన చూసి బడా స్టార్స్ సైతం ఫిదా అయిపోయారు మెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేసి..నటనతో..కామెడీ టైమింగ్ తో అభిమానులను మెప్పించింది మీనా. కోలీవుడ్ లెజండ్ హీరో రజనీకాంత్ ..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం మీనా యాక్టింగ్ ను ఆమెలోని టాలెంట్ ను పలు సంధర్భాలల్లో పొగడటం మనం చూశాం. ఇక ఆ తర్వాత వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న మీనా.. ప్రస్తుతం రీ ఎంట్రీ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే.

సెకండ్ ఇన్నింగిస్ లోను అమ్మడు హవా కొనసాగుతుంది. కానీ వచ్చినా అవకాశాలనింటికి సైన్ చేయకుండా..ఆచి తూచి అడుగులు వేస్తూ..కెరీర్ ని మళ్ళి ఫాం లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే సడెన్ గా మీనా తల్లి కాబోతుందా అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. వాట్.. ఏంటి.. మీకేమైనా పిచ్చా అని తిట్టుకోకండి.. మీనా తల్లి కాబోతుంది నిజమే.. కానీ నిజజీవితంలో కాదు సినిమాలో మాత్రమే. దీనికి సంబంధించిన వీడియోను మీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అలనాటి మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుని.. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఈ వీడియో లో మీనా 9 నెలల గర్భవతిగా కనిపించింది. దీంతో మొదట ఈ వీడియో చూసిన అందరు షాక్ అయ్యారు. కానీ, తరువాత అసలు మ్యాటర్ తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.