వామ్మో..డైరెక్టర్ పై అలాంటి కామెంట్స్ ..అప్పుడే అంత బలుపా..?

సిద్ధు జొన్నలగడ్డ.. ఒకప్పుడంటే ఈ పేరు కి ఇంట్రడక్షన్ అవసరం కానీ..ఇప్పుడు ఎందుకు. అందరి నోట మారుమ్రోగిపోతుంది ఈ పేరు. నిజానికి సిద్ధు ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తోనే గుర్తింపు సంపాదించుకున్నాడు.. కానీ DJ Tillu సినిమా తోనే స్టార్ గా మారిపోయాడు. అదృష్టం అంటే ఇతడి దే. ఒక్కే ఒక్క సినిమాతో స్టార్ హీరో స్టేటస్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సిద్ధు బయటకి వెళ్లితే ఫ్యాన్స్ అరుపులు.. కేరింతలు..వామ్మో రచ్చ రచ్చ చేస్తున్నారు. అంత పాపులర్ అయిపోయాడు ఈ యంగ్ హీరో.

DJ Tillu సినిమా తరువాత సిద్ధుకి చాలా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే సినిమాలు చేయాలని వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. ఒక హీరో ఆ మాత్రం ఆలోచించకపోతే..కష్టం. కానీ, కమిట్ అయిన సినిమా నుండి తప్పుకోవాలి అనుకోవడం..అది కూడా సిల్లీ రీజన్స్ చెప్పి..అది కూడా ఇంత పాపులర్ అయ్యాక..పెద్ద పేరు వచ్చాక..బడా డైరెక్టర్స్ అవకాశాలు ఇస్తున్న క్రమంలో. యస్..తాజాగా వినిపిస్తున్నా మాటల ప్రకారం..సిద్ధు DJ Tillu సినిమా కంటే ముందే ఓ చిన్న రోల్ చేయడానికి సైన్ చేశాడట.

ఆ రోల్ చాలా అంటే చాలా చిన్నది..కానీ స్టోరీని మలుపు తిప్పే పాత్ర అది. అందుకే ఆయన ఓకే చేశారట. కానీ ఆ సినిమా కంటే ముందే DJ Tillu సినిమా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు స్టార్ అయిపోయాడు. మరి ఇలాంటి టైంలో అలాంటి రోల్ చేస్తే..మళ్లీ హీరో గా సెటివ్ అవ్వుతామా లేదా అనే డౌట్ వస్తుంది. అందుకే సిద్ధు.. సైన్ చేసిన సినిమా నుండి తప్పుకోవాలి అనుకున్నారట. కానీ డైరెక్టర్ మాత్రం ఒప్పుకోవడం లేదట. అగ్రీమెంట్ మీద కూడా సైన్ చేశావ్ అంటూ గుర్తుచేస్తుంటే..సిద్ధు కొంచెం టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడారట. ఈ విషయం బయటకు రావడంతో సినీ ప్రముఖులు సైతం ఒక్క సినిమా కే అంత బలుపు ఎక్కిందా ఈ హీరోకి..ఇలా అయితే ఇండస్ట్రీలో నెట్టుకు రావడం కష్టమే అంటున్నారట. మరి హీరో గా సిద్ధు ఫ్యూచర్ ఎలా ఉంటుందో..?