విడాకుల తరువాత సమంత ఆగట్లేదుగా!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత వరుసబెట్టి సినిమాలను సైన్ చేస్తూ దూకుడును ప్రదర్శిస్తుంది. అయితే ఆమె కేవలం ఇలాంటి సినిమాలే చేయాలని అనుకోవడం లేదట. తనకు ఫేం వచ్చే ప్రతి పాత్రను ఓకే చేస్తూ పోతుంది. ఈ క్రమంలోనే అమ్మడు మరింత బోల్డ్‌గా మారుతోందట. ఇప్పటికే యశోద, శాకుంతలం వంటి సినిమాల్లో సమంత అందాల ఆరబోతను ప్రేక్షకులు త్వరలో చూసేందుకు రెడీ అవుతున్నారు.

కాగా లీడ్ రోల్స్ మాత్రమే కాదు, హాట్ ఐటెం సాంగ్స్‌లోనూ అమ్మడు రెచ్చిపోతుంది. ఇప్పటికే పుష్ప చిత్రంలో ఊ అంటావా పాటలో అందాల ఆరబోతతో యావత్ ఇండియాను షేక్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మరోసారి బోల్డ్ అంటే ఏమిటో చూపించేందుకు రెడీ అవుతోంది సామ్. తమిళ హీరో విజయ్ సేతుపతి, నయనతార, సమంత లీడ్ రోల్స్‌లో వస్తున్న ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది.

దర్శకుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మనముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఇద్దరు హీరోయిన్లను ప్రేమిస్తాడు. అయితే ఈ సినిమాలో నయనతార చాలా పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తుంటే, సమంత మాత్రం హాట్ డ్రెస్సులతో ప్రేక్షకులకు ఫైర్ పుట్టించేందుకు రెడీ అవుతోందట. అంతేగాక ఈ సినిమాలో అమ్మడు కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా చేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా విడాకుల తరువాత అందాల ఆరబోతలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు ఈ బ్యూటీ.