సమంత బాడీపై మూడు.. అయినా వద్దంటోన్న బ్యూటీ!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తరువాత ఈ బ్యూటీ వరుసగా సినిమా ఆఫర్లుపట్టేస్తూ మిగతా హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. కాగా ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో హాట్ ఐటెం సాంగ్‌లో నటించిన ఈ బ్యూటీ, మరిన్ని ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా రెడీ అవుతోంది.

అయితే తాజాగా అమ్మడు తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆమెను టాటూల గురించి ఓ ప్రశ్న అడిగాడు. అతడికి సమాధానంగా సామ్ జీవితంలో అసలు టాటూలు వేయించుకోవద్దని సూచించింది. తాను కూడా జీవితంలో టాటూలు వేసుకోకూడదని అనుకున్నానని.. కానీ కాలంతో పాటు నడవడంలో ఆమె తన ఒంటిపై ఏకంగా మూడు టాటూలు వేసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

సమంత చైతూతో కలిసి చేసిన ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా వైఎంసీ అనే అక్షరాలను వీపుపై టాటూ వేయించుకుంది. నడుముపై చై అనే పేరును, కుడిచేతి మీద రెండు యారో మార్క్‌లను టాటూలుగా వేసుకుంది ఈ బ్యూటీ. తన ఒంటిపై మూడు టాటూలు ఉన్నా కూడా అభిమానులకు టాటూలు వేసుకోవద్దంటూ సామ్ సూచించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.