అక్కినేని ఫ్యామిలీ దెబ్బ సమంతకు గట్టిగానే తాకిందా..?

అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన బ్రాండ్. అందుకు తగ్గట్టుగానే అక్కినేని నాగేశ్వరరావు లీగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఆ వంశానికి చెందిన యాక్టర్స్. అయితే మగవారి విషయం ఎలా ఉన్నా, ఆ ఫ్యామిలీకి చెందిన ఆడవారు మాత్రం ఎప్పుడు ఎలాంటి కాంట్రోవర్సీలకు చోటివ్వరు. అయితే అక్కినేని ఫ్యామిలీలోని సభ్యుల్లో చాలామందిలో కనిపించే కామన్ విషయం ఏమిటంటే.. ఈ ఫ్యామిలీలో చాలా మందికి మొదటి పెళ్లి విడాకులుతో ముగిసింది.

ఆ జాబితాలోకి అక్కినేని నాగచైతన్య, సమంత జోడీ కూడా వచ్చి చేరింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ, మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే విడాకుల తరువాత ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. కాగా సమంత మాత్రం విడాకుల తరువాత రెచ్చిపోయి సినిమా చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. అయితే కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ రచ్చ చేస్తోంది.

అయితే టాలీవుడ్‌లో మాత్రం సమంతకు చేతిలో రెండు ప్రాజెక్టులు తప్ప మరొక సినిమా లేదు. కేవలం ఆమె అందాల ప్రదర్శన కోసం ఐటెం సాంగ్స్‌కే ఆమెను ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడి జనం. దీంతో అక్కినేని ఫ్యామిలీ దెబ్బకు సమంతకు టాలీవుడ్‌లో నూకలు చెల్లిపోయినట్లే అంటున్నారు పలువురు సినీ క్రిటిక్స్. మరి ఇలాంటి వాటిని ఎదుర్కొని తన ట్యాలెంట్‌తో సమంత టాలీవుడ్ సినిమాల్లో నిలదొక్కుకుంటుందా లేక తమిళ సినిమాలతోనే నెట్టుకొస్తుందా అనేది చూడాలి.