పదే పదే అదే తప్పు..అనీల్ కి తప్పదు భారీ మూల్యం..?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నా..కామెడీ ని పండించే దర్శకులు అంటే జనాలకి నచ్చుతారు. వాళ్ళనే ఎక్కువగా లైక్ చేస్తారు. సినిమాని తెరకెక్కించెటప్పుడు మూవీ లో అన్నీ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకునే డైరెక్టర్లల్లో ..అనీల్ రావిపూడి కూడా ఒకరు. వల్గారిటీకి దూరంగా..కుటుంబ కధలకు దగ్గర గా ఉంటాయి ఈయన తెరకెక్కించే మూవీలు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ పండించటంలో అనీల్ తరువాతే ఎవ్వరైనా..సరిలేరు నీకెవ్వరు లాంటి మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాప్ దర్శకుల లిస్ట్ లోకి చేరిపోయాడు అనీల్.

ప్రజెంట్ ఈయన సీనియర్ హీరో వెంకటేష్..మెగా హీరో వరుణ్ తో F3 అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. గతం లో వీళ్లిద్దరితోనే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ F2 అంటూ సినిమా ను తెరకెక్కించి..బాక్స్ ఆఫిస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు. భార్య భర్తల మధ్య వచ్చే ఫన్నీ సన్నివేశాలను అద్భుతంగా చీత్రీకరించాడు అనీల్. రొమాన్స్ ని కూడా హెల్తీ గా చూయించటంలో అనీల్ రూటే వేరు. కుటుంబం మొత్తం కలిసి సినిమా చూసేలా F2 సినిమా ని తెరకెక్కించాడు. ఈ సినిమాకి సీక్వెల్ నే F3.

ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా..కరోనా చేత కొన్ని నెలలు..హీరో హీరోయిన్లు డిలే వల్ల..వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్‌స్ కారణంగా క్ కొన్ని రోజులు లేట్ అయ్యింది. కానీ వాళ్ళ సినిమాని జనాలు మర్చిపోకుండా ఉండాలని..ప్రతి పండగకి..ఓ స్పెషల్ పోస్టర్..వీడియో రిలీజ్ చేస్తూ..అభిమానులను ఉత్సాహ పరుస్తున్నాడు అనిల్ రావిపూడి. ఉగాది సంధర్భంగా కూడా ఫ్యామిలీ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ప్రతి ఒక్కరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ..సినిమాలోని ప్రధాన తారాగణం ఉన్న కొత్త పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపారు. ఎఫ్3లో ‘భార్య బాధితులు’గా కనిపించిన వెంకటేష్, వరుణ్ తేజ్ చేతిలో మెగాఫోన్ లు పట్టుకుని వారిని భయపెట్టడం ఆసక్తిని సంతరించుకుంది. కానీ, అనీల్ రిలీజ్ చేసిన లుక్స్ చూస్తుంటే సేమ్ F2 సినిమా లో ఉన్న మాదిరే ఉంది తప్పిస్తే కొత్తదనం ఏం లేదు. దీంతో అభిమానులు కొంతమేర నిరాశపడుతున్నారు. ఒక్కవేళ్ల సినిమా అంతా F2లానే నడిస్తే …బాక్స్ ఆఫిస్ వద్ద సినిమా బొక్క బొర్లా పడటం ఖాయం..అనీల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదటున్నారు సినీ విశ్లేషకులు. మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా చేయడానికి ఎఫ్ 3 సిద్ధంగా ఉంది.