సీనియర్ నటి రమప్రభను అంత‌లా మోసం చేసిన ఆ వ్య‌క్తి ఎవ‌రు..!

ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ప్రేమించుకోవడం కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు కొంతమంది అన్యోన్యంగా ఉంటే మరి కొంత మంది మాత్రం ఆ తరువాత విడాకులు తీసుకొని వేరు పడిన వారు కూడా ఉన్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ భార్యల నుంచి విడాకులు తీసుకోవడం మరో పెళ్లి చేసుకోవడం కూడా చేశారు. అయితే అందరిలోకెల్లా సంచలనంగా మారిపోయిన విడాకుల వ్యవహారం మాత్రం రామప్రభ – శరత్ బాబు విడాకులే అని చెప్పాలి.

ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటులు. ఇక ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రేమలోపడి పెళ్ళి చేసుకున్నారు. ఇక 13 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో విడాకులు తీసుకున్నారు.విడాకులకు సంబంధించి శరద్ బాబు ఒకలా చెబితే అటు రమాప్రభ మరోలా చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రామ ప్రభ కంటే శరత్ బాబు 8 ఏళ్ళు చిన్న వాడు కావడం గమనార్హం.

అయితే ఇద్దరు సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న సమయంలో రమ ప్రభ కొంత మంది తో సన్నిహితంగా ఉంది అంటూ శరత్ బాబు ఇక తరచూ గొడవలు పడటం చేసేవాడట. అయితే అదే సమయంలో తన ప్రవర్తన షెడ్యూల్ డేట్స్ మొత్తం చూసేందుకు సొంత తమ్ముడైన రెడ్డి శేఖర్ నియమించకుందట రమప్రభ. రెడ్డి శేఖర్ శరత్బాబుకు డ్రైవర్ గా కూడా పనిచేసేవారు. ఇక వీరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఏర్పడింది.

అయితే ఇక రమ ప్రభ శరత్ బాబు తో విసిగిపోయి కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకుంది. ఆ సమయంలో రమ ప్రభ సొంత తమ్ముడు రెడ్డి శేఖర్ శరత్బాబు అనుకూలంగా సాక్ష్యం చెప్పడంతో ఆస్తులు మొత్తం కోల్పోయింది రమ ప్రభ. ఆ తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.. ఇలా సొంత తమ్ముడి వల్లనే మోసపోయింది రమ ప్రభ.