స్టార్ హీరో ని దూరం పెడుతున్న సుకుమార్..యవ్వారం తేడా కొడుతుందే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా..కొత్త వాళ్ళు వస్తున్నా..కొందరు డైరెక్షన్ అంటే అభిమానులు పడి చచ్చిపోతారు. వాళ్ల టైమింగ్ కి రైమింగ్ కి స్టోరీకి అలవాటు పడిపోయంటారు. ఎప్పుడో పుష్కర కాలాని ఓ సినిమా తీసిన్నా అలాంటి వాళ్ల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు హంగామా సృష్టిస్తారు. అలాంటి డైరెక్టర్లల్లో లెక్కల మాస్టర్ సుకుమార్ ఒకరు. ఈయన తీసే ప్రతి సినిమాకి అందులో వచ్చే ప్రతి సీన్ కి ఒక క్యాలుకులేషన్ ఉంటాది. అందుకే అభిమానులు ఈయన సినిమా అంటే ఇష్టపడతారు.

రీసెంట్ గా బన్నీ తో పుష్ప అనే సినిమా తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సుక్కు..ప్రజెంట్ బన్నీ తోనే పుష్ప పార్ 2 తెరకెక్కించడానికి రెడీ గా ఉన్నాడు. పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ..వచ్చే మంది ఆఖరు నాటికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. కాగా, అప్పుడెప్పుడో పుష్ప సినిమా కంటే ముందే రౌడి హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా ఉంటుందని టాక్ వినిపించింది. అంతేకాదు ఈ సినిమా గురించిన ఇతర పనులు కూడా పుర్తి చేసుకున్నారు అని వార్తలు ఓ రేంజ్ లో హల్ చల్ చేశాయి.

సీన్ కట్ చేస్తే…ఇప్పటి వరకు ఆ సినిమా కి సంబంధించిన విషయాని అటు విజయ్ ఇటు సుక్కు పట్టించుకోనే లేదు . సుక్కు ఏమో పుష్ప పనుల్లో బిజీ గా ఉంటే విజయ్ ఏమో లైగర్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం వెయిట్ చేసిన విజయ్..ఇప్పుడు లైగర్ నుండి రిలీఫ్ అవ్వడంతో కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడు..ఈ క్రమంలోనే జనగణమన సినిమాతో పాటు ..సుక్కు సినిమాని కూడా లైన్లోపెట్టేదాం అని అనుకున్న హీరోకి సుకుమార్ హ్యాండ్ ఇచ్చాడు..పుష్ప పార్ట్ 2 కంప్లీట్ అయ్యాకనే .. మిగత ప్రాజెక్ట్స్ గురుంచి ఆలోచిస్తా అని చెప్పేశాడట. దీంతో కోపం వచ్చిన విజయ్ సుకుమార్ తో సినిమా ని క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సుకుమార్ నే కాదు మేము బిజీనే..మాకు బోలెడు ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి…అంటూ మండిపడుతున్నాడట విజయ్.