సమంత పెద్ద రిస్క్ చేసింది..ఈ క్రేజీ హీరోయిన్ అంత మాట అనేసిందేంటబ్బా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..విడాకుల తరువాత అందలా అరబోతల విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లు బీహేవ్ చేస్తుంది. రాను రాను ఓవర్ గ్లామర్ డోస్ తో కుర్ర కారుకి నిద్ర పట్టకుండా చేస్తుంది. అందాల ఆరబోతలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూనే..కామెంట్స్ చేసిన నెటిజన్స్‌కు మళ్ళీ తిరిగి కౌంటర్ ఇస్తోంది. మొన్న ఆ మధ్య టూ బికినీ తో పిచ్చెక్కించిన సమంత..రీసెంట్ గా ప్రముఖ ఆల్కహల్ బ్రాండ్ ను ప్రమోట్ చేసి వార్తల్లో హెడ్ లైన్స్ లో నిలిచింది. అంతేనా ఆ బ్రాండ్ ప్రమోషన్ వీడియో లో హాట్ అందాలు వలకబోస్తూ..టూ సెక్సీ గా కనిపించింది. ఎద అందలు కనిపించేలా అమ్మడు వేసిన బ్లౌస్ మరీ దారుణంగా ఉందన్న కామెంట్లు వినిపించాయి.

కాగా, రీసెంట్ గా క్రిటిక్స్ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళిన సమంత తన హాట్ డ్రెస్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లాంగ్ గౌన్ అయినా సరే..చూపించకూడని అందాలు చూయిస్తూ..చూయించాల్సిన నడుము అందాలను దాచేస్తూ ..కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది. తాజాగా సామ్ ‘ఫ్యామిలీ మ్యాన్’లో తన పాత్రకు సంబంధించి ఒక అవార్డు అందుకోవడానికి ముంబయి వెళ్లింది. అక్కడ అందరి చూపులూ సమంత మీదే పడేలా సూపర్ హాట్‌గా డ్రెస్ చేసుకుని వెళ్లింది. అక్కడే ఫోటో షూట్ కూడా చేసింది.. ఆ ఫోటోలు గురించి చెప్పడం కన్నా మీరే చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.

అయితే, సమంత టూ హాట్ అందాలు ఆరబోయడమే కాదు..కెరీర్ లో రిస్క్ లు కూడా చేసిందట. ఆ విషయాని మరో హీరోయిన్ చెప్పుకురావడం గమనార్హం. హాట్ బ్యూటీ మాళవిక మోహన్ గత కొన్ని నెలలు నుండి అమ్మడు పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. దానికి కారణం ఆమె పెట్టే బికినీ ఫోటోస్..సెగలు రేపే హాట్ ఫోటోస్. ఇలాంటి హాట్ బ్యూటీ సమంత పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆమె జరిపిన తాజా చిట్ చాట్ లో సమంత గురించి మాట్లాడుతూ ..”సమంత మల్టీ టాలెంటెడ్ నటి. ఏ పాత్రనైన అలవోకగా నటించేస్తుంది. డిఫరెంట్ రోల్స్ లో మెప్పించడం ఆమె స్పెషాలిటీ. కెరీర్‌లో సమంత ఎన్నోసార్లు రిస్క్ చేసింది. బహుశా..ఆమె అంతలా అలా రిస్క్ చేయడం వల్లే ఇప్పుడు ఈ రేంజ్‌కు చేరుకుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా సమంత చేసిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ 2..అందులో అంత బోల్డ్ గా చేయడం పెద్ద రిస్కే. అంతేకాదు..సమంత అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుని మాలాంటి చాలా మంది హీరోయిన్స్‌కు ఇన్స్పిరేషన్‌గా నిలిచిందని పోస్ట్‌లో మాళవిక చెప్పుకొచ్చింది. దీంతో మాళవిక కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.