ఓవ‌ర్సీస్‌లో RRR క‌లెక్ష‌న్ల తుఫాన్‌.. అప్పుడే తిరుగులేని రికార్డ్‌..!

పాన్ ఇండియా సినిమా, మోస్ట్ అవైటెడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఎట్టకేలకు విడుదల అయ్యి సెన్సేషనల్ మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ రోజు భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇక సినిమా చూసిన వారు ప్ర‌తి భాష‌లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ ఉంద‌ని చెపుతున్నారు. ఇక ఏపీ, తెలంగాణ‌లో మూడు రోజుల‌కు అస‌లు టిక్కెట్లు ఖాళీ లేవు. మొత్తం బుక్ అయిపోయాయి.

అటు ఓవ‌ర్సీస్ లో తెలుగు వెర్ష‌న్‌లో త్రిబుల్ ఆర్ తిరుగులేని రికార్డుల మోత మోగిస్తోంది. రిలీజ్‌కు 20 రోజుల ముందే అక్క ప్రి బుకింగ్స్ స్టార్ట్ చేశారు. ఎప్పుడో 2.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా ఈ రోజుతో 3 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను క్రాస్ చేసింది. రిలీజ్ ఫ‌స్ట్ డే అది కూడా ఫ‌స్ట్ షో ప‌డ‌కుండానే ఈ సినిమా ఏకంగా 3 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసింది.

ప్రీమియ‌ర్ వసూళ్ల‌లో ఓవ‌ర్సీస్ లో మాత్ర‌మే కాకుండా.. ఇటు ఇండియాలో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డు సెట్ చేసిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఓవ‌ర్సీస్‌లో 3 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో ఈ సినిమా బాక్సాఫీస్ హంట్ రికార్డు స్థాయిలో ఓవర్సీస్ లో స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.