అవకాశాల కోసం బరితెగించిన పవన్ హీరోయిన్లు..ఏం కర్మ తల్లి మీకు..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకి ఏం కొదవ లేదు. రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తున్న సినీ ఇండస్ట్రీలో..అలనాటి ముద్దుగుమ్మలు కూడా రీ ఎంట్రీకి సిద్ధమౌతున్నారు. ఇప్పటికే చాలా మంది ఒకప్పటి హీరోయిన్లు సెకండ్ ఇన్నింగిస్ స్టార్ట్ చేసి..మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నారు. హీరో, హీరోయిన్ల కి తల్లి..వదిన గా, అత్తగా ..నటిస్తూ జనాలను తన దైన స్టైల్ లో మెప్పిస్తున్నారు.

కాగా, ఇప్పుడు ఇదే రూట్ లో తెర పై కి మరో ఇద్దరు ముద్దుగుమ్మలు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళ ఇద్దరు కూడా పవన్ కల్యాన్ తో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న సుందరీమణులు కావటం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది రికార్డ్ బ్రేకింగ్ హిట్ గా నిలిచిన సినిమా “ఖుషీ”. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డులు మరువలేనివి. ఈ సినిమాలో పవన్ పక్కన హీరోయిన్ గా నటించింది అందాల ముద్దు గుమ్మ భూమిక. తెర పై ఈ జంట రొమాన్స్ చూడటానికి చాలా చక్కగా అనిపించింది. ఈ సినిమాతోనే భూమిక స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.

మరీ ముఖ్యంగా ఆ నడుము సీన్ లో భూమిక పర్ఫామెన్స్ కేక అంటారు అభిమానులు. ప్రజెంట్ ఈ భామ కూడా సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. నాని MCA సినిమాలో వదిన పాత్రలో మెరిసిన ఈ అమ్మడు..ప్రజెంట్ అవకాశాల కోసం హద్దులు దాటుతున్నట్లు లెటేస్ట్ ఫోటో షూట్ చూస్తేనే అర్ధమౌతుంది. భూమికని మనం ఎప్పుడు ఇలాంటి దుస్తుల్లో చుడలేదు. అంత హాట్ గా తయారైంది ఈ బ్యూటీ.

మరో పవన్ హీరోయిన్ మీరా జాస్మిన్..గుడుంబా శంకర్ సినిమా లో పవన్ పక్కన ఆడి పాడి చిందేసిన ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. బాలయ్య, పవన్, రవితేజ లాంటి హీరోల పక్కన నటించిన ఈ బ్యూటీ కూడా రీ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ మధ్య కాలంలో అమ్మడు హీటెక్కించే ఫోటో షూట్లతో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. రీసెంట్ గా అమ్మడు మరింత బోల్డ్ గా కనిపించి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలా వయసు ముదిరిన హీరోయిన్లు హాట్ ఎక్స్ పోజింగ్స్ పై నెటిజన్లు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఈ వయసులో ఇదేం కర్మ మీకు..పిలలతో సంతోషంగా ఉండకుండా అంటూ మండిపడుతున్నారు.