వావ్: తన ఫేవరెట్‌ పాట పాడిన ఎన్టీఆర్‌..ఎంత బాగా పాడారో చూడండి..!!

కొద్ది గంటలే..మరొ కొద్ది గంటల్లోనే..కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్ కాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి..ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ “రణం రౌద్రం రుధిరం”. దాదాపు నాలుగేళ్ళు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి..ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమానే ఈ RRR. ఒక్క రొమాంటిక్ సీన్ లేకుండా..ఒక్క వల్గారిటీ పదం వాడకుండా..ఐటెం సాంగ్ లేకుండా ఈ రోజుల్లో సినిమా తీయ్యాలంటే పెద్ద సాహసమనే చేప్పాలి. ఎందుకంటే..

నేటి కాలం యువత చాలా వరకు ఇలాంటి సీన్స్ లేకపోతే లైక్ చేయడం లేదు. మరీ, RRR విషయంలో ఇప్పటి వరకు వినిపిస్తున్న టాక్ మాత్రం సూపర్ హిట్ అనే తెలుస్తుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తారక్-చరణ్ చాలా కష్టపడుతున్నారు. బహుశా ఈ సినిమాకి జరిపిన ప్రమోషన్స్ వాళ్ళు మిగతా ఏ సినిమాలకు కూడా చేసి ఉండరు అనడం లో ఆశ్చర్యం లేదు. అంతలా చేశారు RRR కోసం చరణ్-తారక్. ఈ విషయాని స్వయంగా రాజమౌళి సైతం చెప్పుతూ వాళ్లని ఆకాశానికి పొగిడేశారు.

కాగా ,రీసెంట్ ఇంటర్వ్యుల్లో తారక్ కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ తారక్ ని ప్రశ్నిస్తూ..”మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏ పాట ఎక్కువగా ప్లే చేస్తారో తెలుసుకోవచ్చా” అని అడిగింది. దీనికి తారక్ జవాబిస్తూ.. ‘కేరాఫ్‌ కంచరపాలెం చిత్రంలోని ఆశ పాశం.. పాట’ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఓ సారి మాకోసం పాట పాడమని యాంకర్‌ కోరగా.. తారక్ చాలా చక్కగా ఆ పాటను పాడి వినిపించాదు. నిజానికి ఈ పాట తారక్ కే కాదు చాలా మంది కి ఇష్టం. అయితే ఎన్టీఆర్‌ పాట పాడటం చూసిన ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా డైరెక్టర్‌ వెంకటేష్‌ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు. తన ఆనందాని షోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘మీ ఫోన్‌ ప్లేలిస్ట్‌లో మా సినిమా పాట ఆశ పాశం.. సాంగ్‌ ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తారక్‌ గారు.” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో తారక్ పాడిన ఆ పాటను అభిమానులు షేర్ చేస్తూ తమ ఫెవరెట్ హీరో “జై ఎన్టీఆర్” అంటూ పొగిడేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం తారక్ పాడిన ఆ పాటను మీరు వినండి..!!