ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ !

దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్ లో పతాకంపై ,ప్రమోద్ ,భువన కుమార్ నిర్మాణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా , పూజ హెగ్డే హీరోయిన్గా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం .పాన్ ఇండియా లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో తెరకెక్కించిన రాధే శ్యామ్ సినిమా నుంచి మరొక ట్రైలర్ వచ్చింది .

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ తన పెళ్లిపై స్పందించాడు. పెళ్లిపై తన అంచనా తప్పిందని చెప్పాడు. “ప్రేమపై నా అంచనాలు తప్పాయి, అందుకే నేను పెళ్లి చేసుకోలేదు” అని ప్రభాస్ చెప్పాడు. ట్రైలర్‌ను ప్రదర్శించిన తర్వాత నటుడు రాధే శ్యామ్ బృందంతో కలిసి జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. భారతీయ సినిమా అభివృద్ధి చెందుతోందని, బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలు దేశాన్ని ఆకట్టుకున్నాయని ప్రభాస్ అన్నారు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.