సూర్య నటించిన మాస్ ట్రీట్ ‘ET ‘ ట్రైలర్ రిలీజ్

పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాణంలో తమిళ్ హీరో సూర్య నటించిన సినిమా ET . ఇందులో హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా విలన్‌గా నటించిన వినయ్ రాయ్ అద్భుతంగా నటించాడు.అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డి ఇమ్మాన్ అందించాడు .

సూర్య నటించిన ఆఖరి రెండు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ చేసారు.అయితే ఈ రెండు సినిమాలూ హిట్ అయిన సంగతి అందరకి తెలిసిందే.ఈ సినిమా ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. బలహీన వర్గంగా భావించే మహిళలపై నేరాలు ఎలా జరుగుతాయో ట్రైలర్‌లో చూపించారు. క్రిమినల్ గ్యాంగ్‌ను రక్షించడానికి సూర్య ఎలా పోరాడతాడు అనేది కథాంశాన్ని సూర్య మాస్ మరియు యాక్షన్ అవతార్‌లో కనిపించాడు, ET ఈ నెల 10న విడుదల కానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది.