‘ భీమ్లానాయక్ ‘ 5 డేస్ క‌లెక్ష‌న్లు… ఇండస్ట్రీలో ఇది కొత్త రికార్డు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రానా ద‌గ్గుబాటి న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజు నుంచే సూప‌ర్ హిట్ టాక్ తో దూసుకుపోతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి భారీ లాభాల్లోకి వ‌చ్చేసింది. ఓవ‌ర్సీస్‌లో అయితే అమెరిక‌న్ హాలీవుడ్ సినిమాల‌ను కూడా బీట్ చేసి టాప్ 1 ప్లేసులో ట్రెండ్ అవుతోంది. 5 రోజుల‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భీమ్లానాయ‌క్ ఏరియాల వారీగా రాబ‌ట్టిన వ‌సూళ్లు ఇలా ఉన్నాయి..

నైజాం – 31. 19 కోట్లు
సీడెడ్ – 8. 88 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 6.26 కోట్లు
ఈస్ట్ – 4.69 కోట్లు
వెస్ట్ – 4.48 కోట్లు
గుంటూరు – 4.65 కోట్లు
కృష్ణా – 3.13 కోట్లు
నెల్లూరు – 2.22 కోట్లు
———————————–
టోట‌ల్ షేర్ = 65.60 కోట్లు
———————————-
టోట‌ల్ గ్రాస్ = 91.30 కోట్లు
———————————

ఇక ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 108 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇప్పుడు ఏపీలో మిన‌హా ఓవ‌ర్సీస్‌, నైజాంలో భీమ్లానాయ‌క్ స్ట‌డీగానే ఉంది. నిన్న శివ‌రాత్రి రోజు కూడా మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ నెల 11న రాధేశ్యామ్ వ‌చ్చేవ‌ర‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భీమ్లా జోరుకు బ్రేకులు ప‌డేలా లేవు.