‘ అఖండ ‘ 100 రోజుల వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లు.. ఏరియాల వారీ షేర్‌

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా అఖండ‌. గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. సింహా, లెజెండ్‌, అఖండ ఈ మూడు సినిమాలు బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్లుగా నిలిచాయి.

అఖండ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అఖండ గ‌ర్జ‌న మోగించింది. తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. క‌ర్నూలులో శ‌నివారం రాత్రి అఖండ 100 రోజుల ఫంక్ష‌న్ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. ఇక ఈ సినిమా డైరెక్టుగా 4 కేంద్రాలు.. షిఫ్టింగుల‌తో క‌లుపుకుని మ‌రో 16 కేంద్రాలు మొత్తంగా 20 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా చూస్తే ఈ సినిమాకి గాను టోటల్ 100 రోజుల్లో 225 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. థియేట్రికల్ గా 95.55 కోట్ల గ్రాస్ ని మరియు 160 కోట్ల గ్రాస్ రాగా మిగతా హక్కులకు కలిపి మొత్తంగా 225 కోట్ల వసూళ్ళని అఖండ అందుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ సినిమా ఏరియాల వారీ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 26 కోట్లు
సీడెడ్ – 19 కోట్లు
వైజాగ్(ఉత్తరాంధ్ర) – 7.50 కోట్లు
తూర్పు గోదావరి – 4.75 కోట్లు
పశ్చిమ గోదావరి – 4.30 కోట్లు
గుంటూరు – 70 లక్షలు
కృష్ణ – 40 లక్షలు
నెల్లూరు – 30 లక్షలు
కర్ణాటక – 80 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 20 లక్షలు
ఓవర్సీస్ – 10 కోట్లు