సంచ‌ల‌న పాత్ర‌లో స‌మంత‌… ఫ్యాన్స్‌కు ఒక్క‌టే ఆతృత‌…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే… నాగ చైతన్య తో విడాకులు ప్రకటన చేసినప్పటి నుంచి ఈమె కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టి వరుస సినిమాలలో చేసుకుంటూ వెళుతోంది. అయితే నాగచైతన్య తో విడాకులు అనంతరం ఈమె సినీ పరిశ్రమకు దూరం అవుతుందని అందరూ భావించారు. కానీ వరుస ప్రాజెక్టును ఓకే చేసుకుంటూ ప్రతి ఒక్కరికి షాకిచ్చింది. ఇక అంతే కాకుండా తమ స్నేహితులతో కలిసి కొన్ని విహార యాత్రలకు వెళుతూ మనసులో ఉన్న బాధని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది సమంత.

అయితే సమంత ఈ మధ్య కాలంలో తరచుగా గ్లామర్ విషయంలో కాస్త ఎక్కువగానే ఒలకబోస్తోంది అని చెప్పవచ్చు.. ఇక ఫ్యామిలీ మాన్-2 వెబ్ సిరీస్ లో మాత్రం విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. దీంతో ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో ఈమె ది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అని చెప్పవచ్చు కేవలం నటనతోనే కాదు యాక్షన్ సన్నివేశాల్లో కూడా అందరిని మెస్మరైజ్ చేసింది సమంత. దీంతో మరొకసారి కొన్ని వెబ్ సిరీస్ ల తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

ఇక బాలీవుడ్ హీరో వరుణ్ దావన్ నటించబోతున్న ఒక వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట. అమెరికాకు చెందిన పాపులర్ వెబ్ సిరీస్ ను ఇండియన్ వర్షన్ లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా భారీగానే ఉండబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సమంత ఒక ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలం నుంచి వాటి పైన కసరత్తు చేస్తూ ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో సమంత మగరాయుడిలా ఉండే పాత్రలో నటించబోతోంది అన్నట్లుగా సమాచారం. ఈ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలని సమత అభిమానులు, ప్రేక్షకులు సైతం చాలా ఆతృతగా ఉన్నారు.