వరుస ఫ్లాపులు..శ‌ర్వానంద్ షాకింగ్ డెసిష‌న్‌..వద్దు సార్ వద్దు..?

శ‌ర్వానంద్.. ఒకప్పుడు ఈయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే పెద్ద పెద్ద స్టార్ హీరొలు కూడా భయపడేవారు. శ‌ర్వా సినిమాకి పోటీకి వెళ్ళితే మన సినిమా తట్టుకోలేదు అనుకుని వెనక్కి వెళ్లే వాళ్ళు. పాత రికార్డులు తిరగరాసేవాడు ఈ హీరో. ఫీల్ గుడ్ మూవీస్ ని సెలక్ట్ చేసుకుంటూ..వల్గారిటీకి దూరంగా..కామెడి కీ దగ్గరగా ఉండే స్టోరీ లైన్లు సెలక్ట్ చేసుకుంటూ జనాల్లో తనకంటూ ఓ స్పేషల్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. శ‌ర్వా సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఎంజాయ్ చేయచ్చు అనేలా ఉంటుంది అన్న నమ్మకం ఏర్పడింది. అంత బాగుంటాయి శ‌ర్వా సినిమాలు.

కానీ , ఏ దిష్టి తగ్గిలిందో ఏమో తెలియదు కానీ గత కొంత కాలంగా ఈ హీరోకి ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా పడటం లేదు సరికదా… కనీసం ఆ సినిమా పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకోలే కపోతున్నాయి. లోపం ఆయనలో ఉందా..లేక టైం బ్యాడ్ నా అనేది అర్ధం కాక శ‌ర్వా ఫ్యాన్స్ సైతం నిరాశ పడుతున్నారు, మా హీరో ఒక్క సినిమా హిట్ కొడితే చూడాలి అంటూ సోషల్ మీడియా వేదికగా శ‌ర్వా కి పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

రీసెంట్ గా రిలీజైన “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమాలో అయన నటన బాగున్నా..కధలో బలం లేకపోవడంతో సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉండటం తో.. ఆ హైట్స్ అందుకోలేకపోయిన శర్వా ..ఫలితంగా మరో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా కానీ శ‌ర్వా కి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ లో శ‌ర్వానంద్ ఇప్ప‌టికే ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లెటేస్ట్ సెన్సేషన్ ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీమేల్ లీడ్ రోల్‌లో న‌టించ‌నుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టు త‌ర్వాత మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం శ‌ర్వా ఎవ్వరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడట. సినిమా స్టార్ట్ అయ్యేలోపు ఆయన తన బరువు తగ్గించుకునే పనిలో పడ్డారట. ఈ మధ్య కొంచెం బొద్దుగా కనిపిస్తున్న శర్వా..తన లుక్స్ మారిస్తే నైనా..సినిమా హిట్ అవుతుందేమో అని ఇలా ట్రై చేస్తున్నారట. అయితే దీని పై ఫ్యాన్స్ మాత్రం మరోవిధంగా స్పందిస్తున్నారు..నువ్వు స్లిమ్ అయితే చూడటానికి బాగోవు..ఇప్పుడే బాగున్నావు…బరువు తగ్గితే కీర్తిలా అయిపోతావు..వద్దు నువ్వు నీ లానే ఉండు శర్వా”అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. మరీ శర్వా అభిమానుల మాట వింటాడా లేదా అనేది చూడాలి..