‘భీమ్లానాయక్ ‘ కోసం వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్!

రిలీజ్ డేట్లు మారుస్తూ వచ్చిన భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఈ నెల 25 తేదీన వస్తుంది .అయితే పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ముందే ఇదే తేదీన రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలన్నీ రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ చేసుకున్నాయి .ఇందులో మొదటి సినిమా శర్వానంద్ హీరో గా వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పవన్ కోసం వాయిదా వేసుకున్నారు .అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ సినిమాలు మలి వారానికి వాయిదా వేసుకోగా ఇప్పుడు మేము పవర్ స్టార్ కి దారి ఇస్తున్నామని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన అవైటెడ్ చిత్రం “గని” చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.https://youtu.be/zYa9wu_dTe4

గని టీం ఏమన్నారో ఒకసారి చూద్దాం … భీమ్లా నాయక్ సినిమా వస్తుండడంతో మేము గని ని పోస్ట్ పోన్ చేశామని, కొత్త డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. అలాగే అందరితో పాటు తాము కూడా పవన్ సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. వరుణ్ తేజ్ తన బాబాయ్ సినిమా కోసం గని పోస్ట్ ఫోన్ చేసాడని ఇండస్ట్రీలో టాక్ .

https://youtu.be/zYa9wu_dTe4[/embed]