“బిగ్ బాస్ ఓటిటి షో ” కి హోస్ట్ గా ఆ యాంకర్ పేరు వైరల్.!

తెలుగు బుల్లి తెరపై రియాల్టీ షోస్ చేసినవి వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు .వాటిలో ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందిన మాత్రం బిగ్ బాస్ .ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ మాత్రమే . ఈ షో మన దేశంలో అనేక భాషలో సూపర్ హిట్ అయింది .ఇంకా చెప్పాలంటే మన తెలుగు బుల్లి తెరపై బ్లాక్ బస్టర్ అనే చెప్పచ్చు .దీనితో ఇంత గొప్ప విజయాన్ని చుసిన బిగ్ బాస్ నిర్వాహుకులు నిరంతరం ఓటీటీ లో ప్రచారం చేయడానికి సిద్ధం అయ్యారు .

అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చిపడింది .అదేమిటంటే ఈ షో కి గాను హోస్ట్ గా ఎవరు చేత చేయిస్తే అనే ప్రశ్న ఇంకా ఇంట్రెస్టింగ్ గానూ సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి.అయితే గత కొన్ని రోజులుగా గత సీజన్ కి చెందిన కొందరి కంటెస్టెంట్స్ పేర్లు ఈ సీజన్ కి హోస్ట్ గా వినిపించాయి. కానీ ఇపుడు మరో కొత్త పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతడు మరెవరో కాదు, లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్ చేసిన యాంకర్ రవి అట. ఇప్పుడు రవి పేరే ఫైనల్ అయ్యినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అనేది టాక్ మరి దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు అఫీషియల్ క్లారిటీ ఏమన్నా ఇస్తారో లేదో చూడాలి.