ఎన్టీఆర్‌ను ఆలియా ఎంత మాట అనేసింది.. ఎన్టీఆర్ రివ‌ర్స్ కౌంట‌ర్‌..!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్‌. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమాను రు. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల మార్చి 25న త్రిబుల్ ఆర్ 14 భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7నే ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు చేశారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోస‌మే నిర్మాత దాన‌య్య ఏకంగా రు. 20 కోట్లు ఖ‌ర్చు చేశారు. అయితే ఒమిక్రాన్ భ‌యంతో సినిమాను మ‌రోసారి వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు.

ఈ సినిమాలో ఇద్ద‌రు టాలీవుడ్ క్రేజీ యంగ్‌స్ట‌ర్స్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఇద్ద‌రు యంగ్ హీరోలు క‌లిసి న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోంది. ఈ సినిమాలో ఆమె రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమా యూనిట్ సినిమా రిలీజ్‌కు 50 రోజులు ఉండ‌డంతో కౌంట్‌డౌన్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసింది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఓ ప్రెస్‌మీట్లో ఆలియాభ‌ట్ ఎన్టీఆర్‌పై చిన్న చ‌మ‌క్ వేసింది. ఎన్టీఆర్ ఎక్క‌డ‌కు వ‌చ్చినా ఎక్కువుగా తెలుగులోనే మాట్లాడుతున్నాడు అని.. అది త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని.. ఆ తెలుగు త‌న‌కు ఎవ‌రైనా చెపుతారేమో అని తాను దిక్కులు చూడాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని చెప్పింది. ప్రెస్‌మీట్లో ఎన్టీఆర్ త‌న ఎదురుగా ఉండ‌గానే ఆలియా ఇంత మాట అనేసింది. అయితే వెంట‌నే ఎన్టీఆర్ ఊరుకోడు క‌దా.. త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్ ఇచ్చేశాడు.

మేం తెలుగులో మాత్ర‌మే కాదు.. హిందీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాం.. కాక‌పోతే అది మీకు అర్థం కావ‌డం లేద‌ని పంచ్ వేశాడు. అయితే వెంట‌నే ఆలియా మీరు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడ‌డం లేద‌ని మ‌రోసారి న‌వ్వుతూ చెప్పింది.ఇక నార్త్ ప్రెస్‌మీట్ల‌లో ఎన్టీఆర్ ఇంగ్లీష్ వాగ్దాటితో పాటు హిందీలో కూడా అన‌ర్గ‌ళంగా మాట్లాడి త‌న భాషా ప‌టిమ‌ను రుజువు చేసుకున్నాడు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న ఆలియానే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.