హాట్ హాట్ గా రెచ్చిపోతున్న టాలీవుడ్ బ్యూటీస్..

ఒకప్పుడు హీరోయిన్లు.. ఏదో ఒక సందర్భంలో మాత్రమే స్కిన్ షో చేసేవారు. కానీ ప్రస్తుత హీరోయిన్లు మాత్రం ఎక్కువ మంది గ్లామర్ షోకే మొగ్గు చూపుతున్నారు. కొంత కాలం వరకు పద్దతిగా కనిపించిన వారు కూడా తమ ఒంటి అందాలను బయటపెడుతున్నారు. కుర్ర హీరోయిన్లతో పాటు ముదురు భామలు కూడా తమ అందాలతో కైపెక్కిస్తున్నాడు. సినిమాలతో పాటు బయట కూడా గ్లామర్ డోస్ ఓ రేంజిలో పెంచారు.

తాజాగా సమంతా ఓ రేంజిలో గ్లామర్ బ్యూటీగా మారిపోయింది. కెరీర్ ప్రారంభంలో అందాలను చూపించిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత కాస్త డోస్ తగ్గించింది. తాజాగా మళ్లీ రెచ్చిపోతుంది. ఆమె లేటెస్ట్ మూవీ పుష్పలో ఐటెం సాంగ్ చేసిన కుర్రకారును రెచ్చగొట్టింది. అటు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన అమ్మడు.. అక్కడి ఫిల్మ్ మేకర్స్ ద్రుష్టిలో పడే ప్రయత్నం చేస్తుంది. అటు ఇప్పటి వరకు పద్దతిగా కనిపించిన అనుపమ.. తాజాగా అప్ కమింగ్ హీరోతో ఏకంగా లిప్ లాక్ చేసింది. రౌడీ బాయ్స్ సినిమాలో హాట్ హాట్ గా రెచ్చిపోయింది. అటు సోషల్ మీడియాలోనే హాట్ ఫోటోలతో మతిపోగొడుతుంది. సినిమాల్లో కూడా అందాల ఆరబోతకు రెడీ అంటోంది.

కన్నడ బ్యూటీ రష్మిక మందాన కూడా స్కిన్ షోకు రెడీ అంటుంది. పుష్ప సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ చేసిన ఈ అమ్మడు.. మూవీ ప్రమోషన్ లో మాత్రం తన అందాల ప్రదర్శించింది. ఫోటో షూట్స్ లో కూడా ఈ మధ్య బాగా గ్లామరస్ గా కనిపిస్తోంది. అందాల ఎక్స్ పోజ్ కు మొగ్గు చూపుతుంది. అటు ఉప్పెన సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన అమ్మడు కృతిశెట్టి. ఈమె కూడా తాజాగా రెచ్చిపోయింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నానితో ఏకంగా లిప్ లాక్ చేసింది. బంగార్రాజు సినిమాలోనూ మాస్ లుక్ లో అదరగొట్టింది. గ్లామర్ డాల్ గా అలరించింది. ఈమె కూడా మున్ముందు గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ అనే హింట్ ఇచ్చింది.