ఆ కోరికతోనే ఆగలేక 13 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నా అంటున్న ప్రముఖ నటి..!!

ప్రతి ఒక్కరికి ఒక్కో కోరిక ఉన్నట్టుగానే..చాలా మందికి తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే.. చిన్నప్పటి నుంచి కూడా కలలుకంటూ ఉంటారు.. కొంతమంది అవసరాన్ని బట్టి సినిమా ఇండస్ట్రీ లోకి వస్తే..మరి కొంతమంది కలలని నెరవేర్చుకోవడానికి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. సినిమాల మీద పిచ్చి ఎక్కువ ఉన్న వాళ్ళు.. ఎలాంటి పాత్ర దొరికినా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు.. అంతే కాదు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటూ ఉంటారు.. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి జయవాణి కూడా ఒకరు.

ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొని , ఆ తర్వాత ఎక్కువగా విలన్ పాత్రలు పోషించింది. సినిమాలలో ఫిమేల్ రోల్స్ లో విలన్ పాత్రలు చేసే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే ఆమె ఈ పాత్రలో బాగా నటించేది. ఒకే పాత్రలో ప్రతి సినిమాలో చేయడం ఇష్టం ఉండేది కాదని..కొంతమంది దర్శకుల దగ్గరకు వెళ్లి తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగలనని చెప్పిందట. చాలామంది దర్శకులు తనకు బోల్డ్ సీన్లలో నటించే అవకాశం ఇచ్చినట్లు.. కానీ నో చెప్పకుండా చేసినట్లు చెప్పింది. ఇక అలా చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న పిచ్చి కారణంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని , అందుకు తన తండ్రి బాగా సపోర్ట్ చేశాడని ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది.

తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. సినిమాలు అంటే ఎక్కువ పిచ్చి ఉండడంతో, తన సొంత మావయ్యా అయిన గుమ్మడి చంద్రశేఖరరావుకి ఇచ్చి పదవ తరగతి లోనే అంటే 13 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేశారని ఆమె తెలిపింది. ఇక తన భర్త సహకారంతో పెళ్లి అయ్యాక కూడా వరకు బీఏ పూర్తిచేసిందట.సినిమాల విషయంలో తనకు ఎలాంటి కండిషన్లు పెట్టలేదని ఆమె తెలిపింది.