హీరోయిన్ గా అవకాశాలు తగ్గితే ఏం చేయాలి.? నయనతార ఫ్యూచర్ ఫ్లాన్ ఇదే.

నయనతార.. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ గత దశాబ్ద కాలం నుంచి దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ అమ్మడు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు బిజినెస్ లోనూ అద్భుతంగా రాణిస్తుంది. తాజాగా ఈ అమ్మడు దుబాయ్ లోనూ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలిసి అక్కడి ఆయిల్ కంపెనీలో సుమారు రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి రౌడీ అనే పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించారు. అటు చాయ్ వాలే, లిప్ బామ్ బ్రాండ్స్ లోనూ వీరు పెట్టుబడులు పెట్టారు.

సినిమాల విషయంలో నయన్ ప్రస్తుతం రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుంది. ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు అందుకుంటుంది. అయితే ఆ డబ్బుతో ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే నిర్మాతగా మారిన ఈ అమ్మడు.. ఓ సినిమాన్ని నిర్మించింది. అటు రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా ఈ ముద్దుగుమ్మ అడుగు పెడుతుందట. చాయ్ వాలి అనే కాఫీ, టీ షాప్ ల కంపెనీలో రూ. 12 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఆ కంపెనీ చెన్నైలో అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు నడుపుతుంది. అంతేకాదు.. ఈ కంపెనీ యాజమాన్యంతో నయనతారకు మంచి సంబంధాలున్నాయి. అంతేకాదు.. ఈ కంపెనీ మంచి గ్రోత్ తో ముందుకు సాగుతుంది.

అటు నయనతార మరిన్ని వ్యాపారాల్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. తన ఇష్టానికి తగినట్లు ఉండే హై క్లాస్ రెస్టారెంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ తన అభిరుచికి తగినట్లు అంతేకాదు.. తనకు నచ్చిన రుచులన్నీ మెన్యులో ఉండేటట్లు ఆలోచన చేస్తుందట. ప్రస్తుతం ఈ అమ్మడికి 35 ఏండ్లు దాటాయి. మరికొన్నేళ్ల పాటు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఉంటుంది. అవకాశాలు తగ్గే సమయానికి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి ఫ్యూచర్ ను గడిపేలా ప్లాన్ చేసుకుంటుంది.