మంగమ్మగారి మనవడు సినిమా కోసం.. ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ లతో బాలకృష్ణ షాక్?

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో మంగమ్మగారి మనవడు అనే సినిమాకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా బాలకృష్ణ ను ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చేసింది. అంతేకాదు 365 రోజులపాటు థియేటర్లలో ఆడి సరికొత్త రికార్డు సృష్టించింది మంగమ్మగారి మనవడు సినిమా. అయితే తమిళంలో మన్ వాసనై పేరుతో విడుదలై సూపర్ హిట్ సినిమా కు తెలుగు రీమేక్ మంగమ్మగారి మనవడు. అయితే తమిళంలో ఈ సినిమాను భారతీరాజా తెరకెక్కించగా.. ఇక తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ సినిమాలో మంగమ్మ పాత్రలో సీనియర్ నటి భానుమతి నటించడం సినిమాకు చాలా ప్లస్ అయింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా సమయంలో మంగమ్మ పాత్రను కేవలం భానుమతి మాత్రమే చేయాలి అంటూ బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పట్టుబట్టారట.ఇక స్వయంగా ఆయనే ఫోన్ చేసి భానుమతిని ఈ సినిమాలో నటించాలని కోరారట. ఒకప్పుడు భానుమతి టాలీవుడ్ లో నటిగా దర్శకురాలిగా నిర్మాతగా సింగర్ గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి గా కొనసాగింది. అంతేకాదు ఇక మంగమ్మగారి మనవడు సినిమా సమయంలో బాలకృష్ణ కు మూడు కండిషన్లు పెట్టారట తండ్రి ఎన్టీఆర్.

భానుమతి కంటే అరగంట ముందే నువ్వు ప్రతి రోజు షూటింగ్ కి వెళ్ళాలి.. అంతేకాకుండా షూటింగ్లో ఏ ఒక్క రోజు కూడా ఆమెను వెయిట్ చేయించకూడదు.. ఇక భానుమతి సెట్స్ లోకి రాగానే ఆమె కార్ డోర్ నువ్వే తీయాలి అని కండిషన్ పెట్టాడట ఎన్టీఆ..ర్ అంతేకాదండోయ్ ఇక భానుమతి కారులోంచి దిగిన వెంటనే ఆమె కాళ్ళకి నమస్కారం చేయాలని కూడా చెప్పారట.. ఇలా సీనియర్ నటులను ఎలా మర్యాద ఇవ్వాలని పూసగుచ్చినట్లు బాలకృష్ణకు నేర్పించారట ఎన్టీఆర్. ఇక ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు తండ్రి మాటను జవదాటని బాలయ్య ఆయన చెప్పినట్లే ఫాలో అయ్యాడట.