కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి ” ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ అరుదుగా వస్తుంటాయి .ఆలా వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకి తెలిసిందే .టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్లో ఒకటైన ‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా వస్తున్న సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ ప్రయాణం ఎలా సాగిందో అనేది కధ .

‘మన దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయబోతున్నాను’ అంటూ జగపతిబాబు డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచింది. కీర్తి సురేష్ ,ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నగేష్ కుకునూర్ డైరెక్షన్లో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న బాడ్ లక్ సఖి సినిమాని చంద్ర పడిరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘U’ సర్టిఫైతో ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.