కూకట్ పల్లి హోసింగ్ బోర్డు లో శివపార్వతి థియేటర్‌ భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్లో ఈ రోజు తెల్లవారుజామున కూకట్ పల్లి హోసింగ్ బోర్డు లో శివపార్వతి థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.శివ పార్వతి థియేటర్ మొత్తం మంటలు వ్యాపించడంతో హాల్‌ లోని సీట్లు, ఫర్నీచర్‌ , తెర అగ్నికి ఆహుతి అయ్యాయి.ఫైర్ సిబ్బంది వెంటనే ముగ్గురు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అప్పటికే థియేటర్లో దాదాపు ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యాయి .ఈ థియేటర్ లో నాని నటించిన “శ్యాం సింగ రాయ్’ ప్రదర్శింప బడుతుంది .

అయితే ఈ ప్రమాదానికి గలాకారణాలు షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇక ఈ ప్రమాదం కారణంగా తమకు భారీగా ఆస్తినష్టం జరిగినట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. సుమారు రెండు కోట్లు పైన ఆస్థి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.