బంపర్ ఆఫర్ కొట్టేసిన టిక్ టాక్ దుర్గారావ్..!

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తులలో టిక్ టాక్ దుర్గారావ్ కూడా ఒకరు. టిక్ టాక్ యాప్ తో ఒక్కసారిగా బాగా పాపులర్ అయ్యాడు దుర్గారావ్ తన భార్యతో కలిసి కొన్ని ఫేమస్ స్టెప్పులు వేయడం వల్ల బాగా పాపులర్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా దుర్గారావ్ ఒక సెలబ్రిటీ గా మారిపోయాడు. ఇక అప్పుడప్పుడు జబర్దస్త్, ఢీ వంటి షోలలో అప్పుడప్పుడు వస్తూ మెరుస్తూ ఉండేవారు. అయితే దుర్గారావు ఎప్పుడు ఒక బంపర్ ఆఫర్ ని కొట్టేసి నట్లుగా సమాచారం.

తెలుగులో బిగ్ బాస్ షో కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఈసారి ఓటిటీలో వేదికగా అలరించినున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కూడా నాగార్జున ని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో రెండు నెలల సరికొత్త సీజన్ తో ప్రారంభం కానుంది. అయితే ప్రతి సంవత్సరం లాగానే.. ఈసారి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ బాగా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. ఇందులో దుర్గా రావ్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. కానీ బిగ్ బాస్-5 లో కూడా ఛాన్స్ వచ్చింది అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు మిస్సయిన ఛాన్స్ ఇప్పుడు వచ్చినట్లుగా తెలుస్తోంది. దుర్గారావ్ ప్రస్తుతం కొన్ని సినిమాలలో కూడా నటిస్తున్నాడు.